కరోనా వైరస్.. చైనాలో ఎక్కడో ఒక గ్రామంలో పుట్టి ప్రపంచ దేశాలాను సైతం గజగజలాడించింది. చైనా ఇప్పటివరకు 1770 మంది చనిపోయారు. ఇంకా 70,500 మంది సోకిందని చెపుతున్నారు. అయితే ఇప్పటికే వ్యాధి సోకినవారిలో కొందరు రికవర్ అయ్యారు. అయితే దీనికి విరుగుడు కనిపెడుతున్న సైంటిస్ట్ లు ఆ దాని నుండి కోలుకున్న వ్యక్తుల బ్లడ్ డొనేట్ చేస్తే మిగతావారికి ఉపయోగపడుతుందని అంటున్నారు. COVID-19 చేత ప్రేరేపించబడిన న్యుమోనియా స్పెల్ నుండి కోలుకున్న రోగుల నుండి ప్లాస్మాలో యాంటీబాడీస్ ఉన్నాయి, ఇవి తీవ్రమైన అనారోగ్య రోగులలో వైరస్ భారాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ప్రెస్ కు వివరించింది.