వీరిద్దరూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరోలు. ఒకరేమో తన అందచందాలతో ఇండస్ట్రీని షేక్ చేసిన అందాల రాక్షసి. మరోకరు తన నటనతో.. యాక్షన్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకుని స్టార్ హీరో రేంజ్ కు ఎదిగిన సీనియర్ నటుడు. వీరే శ్రియ .. నందమూరి బాలకృష్ణ.
వీరిద్దరూ గతంలో ఆడిపాడిన సంగతి విదితమే. తాజాగా వీరిద్దరిపై ఒక వార్త వైరలవుతుంది. సంచలన మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను నేతృత్వంలో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఓ మూవీలో నటిస్తున్న సంగతి విదితమే.
త్వరలో వారణాసిలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది. అయితే ఈచిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉండే అవకాశముంది. అందులో ఒకరి పాత్రలో హీరోయిన్ శ్రియను ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే ఇంకో హీరోయిన్ గా ఎవరనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.