టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై జరిగిన ఐటీ దాడుల నేపథ్యంలో బయటపడిన 2 వేల కోట్ల కుంభకోణం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది..ఈ 2 వేల కోట్ల స్కామ్‌లో చంద్రబాబు, లోకేష్‌లపై విచారణ జరిపించాలని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే టీడీపీ నేతలు మాత్రం పీఎస్ శ్రీనివాస్‌కు, మా చంద్రబాబుకేం సంబంధం అయినా 2 లక్షలు దొరికితే…2 వేల కోట్లు దొరికాయంటూ వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారంటూ ఎదురుదాడి చేస్తున్నారు. ఎల్లోమీడియా ఛానళ్లు, పత్రికలు కూడా ఐటీ దాడుల్లో 2 లక్షలు దొరికితే..రెండువేల కోట్ల స్కామ్ అంటూ వైసీపీ నేతలు మా బాబుగారిపై బురదజల్లుతున్నారంటూ గగ్గోలు పెట్టాయి. అయితే 2 వేల కోట్ల స్కామ్‌పై టీడీపీ నేతలు, అనుకుల మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారంపై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ ఫైర్ అయ్యారు.
తాజాగా తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబు అవినీతి బాగోతంపై ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులతో టీడీపీ నేతలకు భయం పట్టుకుందని విమర్శించారు. 2 వేల కోట్లు కాదు..దొరికింది 2 లక్షలే అంటూ వితండ వాదన చేస్తున్న టీడీపీ నేతలు ఒకసారి ఐటీ శాఖ ఇచ్చిన ప్రెస్‌నోట్‌ను క్షుణంగా చదువుకుంటే మీ నాయకుడి అసలు బండారం బయటపడుతుందని అమర్‌నాథ్ అన్నారు. ప్రెస్‌నోట్‌లో రెండు వేల కోట్ల అక్రమ లావాదేవీలు జరగాయని పేర్కొంటే.. ఎక్కడ రెండువేల కోట్లు ఉన్నాయని స్వయం ప్రకటిత మేధావి యనమల రామకృష్ణుడు అంటున్నారని కౌంటర్ ఇచ్చారు. పాపం యనమలకు పంటి నొప్పితో పాటు కంటి చూపు కూడా పోయిందని..ఎద్దేవా చేశారు. ఐటీ ప్రెస్ నోట్ ఇచ్చింది వైఎస్సార్‌సీపీ కాదని..కేంద్ర ఐటీ శాఖ ఇచ్చిందని టీడీపీ నేతలు గుర్తుంచుకోవాలని అమర్‌నాథ్ అన్నారు. షెల్‌కంపెనీలను పెట్టి ఆర్థిక లావాదేవీలు జరిపారనిప్రెస్‌నోట్‌లో ఐటీ అధికారులు స్పష్టంగా పేర్కొన్న విషయం.. చంద్రబాబు అండ్ కో, ఎల్లో మీడియాకు కనిపించడం లేదా అని అమర్‌నాథ్ ప్రశ్నించారు. మరి ఆ ప్రెస్‌నోట్‌పై ఐటీ అధికారుల మీద పరువు నష్టం దావా వేసే ధైర్యం చంద్రబాబు కు ఉందా.. ఆయన ఆస్తులు మీద సీబీఐ విచారణ జరపమని కోరే ధైర్యం టీడీపీ నేతలకు ఉందా..అంటూ సవాలు విసిరారు. కొంతమంది చంద్రబాబు చెంచా నేతలు వైఎస్సార్‌సీపీపై విమర్శలు చేస్తున్నారని అమర్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
5 రోజులు ఐటీ దాడులు జరుగుతుంటే…అసలు అర్థరాత్రి పూట కూడా మీడియా సమావేశాలు పెట్టే చంద్రబాబు ఎక్కడున్నారని ప్రశ్నించారు. కనీసం ఓటుకు నోటు మీద అయిన విచారణ కోరే ధైర్యం ఉందా..? అని ప్రశ్నించారు. ఇక జయము జయము చంద్రన్న పాట కాదు.. జైలు జైలు చంద్రన్న పాటలు వేసుకోవాలంటూ ఎద్దేవా చేశారు. ఐటీ శాఖ ప్రెస్‌నోట విడుదల కాగానే చంద్రబాబు రాత్రికి రాత్రే హైదరాబాద్‌కు ఎందుకు పారిపోయారని అమర్‌నాథ్ ప్రశ్నించారు. త్వరలోనే చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచేందుకు సహచర నేతలు సిద్ధంగా ఉన్నారని అమర్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక 2 వేల కోట్ల స్కామ్‌పై చంద్రబాబు దత్త పుత్రుడు పవన్ ఎందుకు నోరు మెదపడం లేదని గుడివాడ గట్టిగా ప్రశ్నించారు. రెండువేల రూపాయలకు ఓటు అమ్ముకునేవాళ్లకు 2 వేలకోట్లు మింగేసిన చంద్రబాబును ప్రశ్నించే హక్కు లేదంటూ.. ప్రజలను కించపరిచే విధంగా పవన్‌కల్యాణ్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. గత ఎన్నికల్లో భీమవరంలో గెల్చేందుకు పవన్ కల్యాణ్ 50 కోట్లు ఖర్చు చేయలేదా…ఓటర్లను నోట్లకట్టలతో కొనాలని చూడలేదా అంటూ అమర్‌నాథ్ దుయ్యబట్టారు. మొత్తంగా 2 వేల కోట్ల స్కామ్ విషయంలో వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ ఒకేసారి చంద్రబాబు, యనమల, పవన్‌కల్యాణ్‌ల ఇజ్జత్ తీశారనే చెప్పాలి.