Home / ANDHRAPRADESH / బ్రేకింగ్..బాబు బ్యాచ్‌కు షాక్..మండలి రద్దు, మూడు రాజధానులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..?

బ్రేకింగ్..బాబు బ్యాచ్‌కు షాక్..మండలి రద్దు, మూడు రాజధానులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..?

ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు బిల్లును ప్రతిపక్ష టీడీపీ శాసనమండలిలో కుట్రపూరితంగా అడ్డుకుని సెలెక్ట్ కమిటీకి పంపించింది. దీంతో ఆగ్రహించిన జగన్ సర్కార్..ఏకంగా శాసనమండలిని రద్దు చేస్తూ…అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపించింది. అయితే మూడు రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని..అమరావతి నుంచి రాజధానిని తరలించడాన్ని మోదీ సర్కార్ ఒప్పుకోదని..అదిగో ఏపీ బీజేపీ కూడా అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని తీర్మానం చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు రాజధాని రైతులను మభ్యపెడుతున్నారు.

ఇక ఎల్లోమీడియా అయితే వికేంద్రీకరణపై కేంద్రం సీరియస్‌గా ఉందని, మోదీ అమరావతికి శంకుస్థాపన చేశాడు కాబట్టి… కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో రాజధాని తరలింపుకు ఒప్పుకోదని, అందుకే మోదీ, ‎షాలు కనీసం జగన్‌కు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వడం లేదని పచ్చకథనాలు వండివార్చాయి. అయితే మూడు రాజధానుల ఏర్పాటు అనేది రాష్ట్రాల పరిధిలోని అంశం కాబట్టి…కేంద్రం రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తుందని పార్లమెంట్‌లో హోంశాఖ సహాయమంత్రి నిరంజన్‌రాయ్ లిఖితపూర్వకంగా సమాధానం చెప్పారు. అదే సమయంలో 2015లోనే అమరావతిని రాజధానిగా గుర్తించాం అని చెప్పారు. దీంతో అదిగో అమరావతిని రాజధానిగా గుర్తించామని కేంద్రం చెప్పిందని, జగన్‌కు ఎదురుదెబ్బ అని టీడీపీ, ఎల్లోమీడియా పండుగ చేసుకుంది.

అయితే తాజాగా సీఎం జగన్ వరుసగా రెండు సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ, అమిత్‌షాలతో భేటీ అవడంతో మరోసారి శాసనమండలి రద్దు, మూడు రాజధానుల బిల్లు వ్యవహారం తెరపైకి వచ్చింది. రెండు సార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్ ప్రధాని మోదీ, అమిత్‌షాలతో జరిగిన భేటీలో శాసనమండలి రద్దు, మూడు రాజధానుల ఏర్పాటు అంశమే ప్రధాన ఎజెండాగా చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సందర్భంగా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అంశం ఉందని సీఎం జగన్ గుర్తు చేయడంతో మోదీ, షాలు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే అమిత్‌షాతో భేటీ తర్వాత అదే రోజు చివరినిమిషంలో కేంద్ర న్యాయశాఖ మంత్రితో సీఎం జగన్ సమావేశం అయ్యారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై సీఎం జగన్‌ వివరణతో అంగీకరించిన కేంద్రం న్యాయశాఖమంత్రి వెంటనే అందుకు అంగీకరించినట్లు సమాచారం. బడ్జెట్ సెషన్ లో మండలి రద్దు తీర్మానానికి ఆమోద ముద్ర వేయలేకపోయామని, మార్చి 3నుంచి జరిగే రెండో దఫా సమావేశాల్లో దీన్ని ఓకే చేస్తామని రవిశంకర్ ప్రసాద్, జగన్ కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఆలోగా కేంద్ర కేబినెట్ ఏపీ శాసనమండలి రద్దుకు, మూడురాజధానుల ఏర్పాటుకు ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది.

ఇప్పటికే మూడురాజధానుల విషయంలో కేంద్రం రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తుందని..అందులో రెండో మాటకు తావులేదని జీవీఎల్ వంటి బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు. సీఎం జగన్ ఢిల్లీ టూర్‌తో శాసనమండలి రద్దు, వికేంద్రీకణకు కేంద్రం దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెండో దఫా బడ్జెట్‌ సమావేశాల్లో వీటికి అధికారికంగా ఆమోద ముద్ర పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సో..మరి కొద్ది రోజుల్లోనే శాసన మండలి రద్దు కావడం, మూడు రాజధానులు ఏర్పాటు కావడం తథ్యంగా కనిపిస్తోంది. అదే జరిగితే అమరావతిపై రచ్చ చేస్తున్న టీడీపీకి కోలుకోలేని దెబ్బ పడడం ఖాయం..ఇక బాబు బ్యాచ్ పని గోవిందా..గోవిందా..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat