టీడీపీ అధినేత చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్‌పై జరిపిన సోదాల్లో దాదాపు 2 వేల కోట్ల స్కామ్ బయటపడిందని…ఐటీ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ 2 వేల కోట్ల స్కామ్‌పై ఏపీ రాజకీయాల్లో పెను దుమారం చెలరేగుతోంది. అయితే శ్రీనివాస్‌పై జరిగిన ఐటీదాడులకు, చంద్రబాబుకు సంబంధం ఏంటని బుకాయించిన టీడీపీ నేతలు, ఎల్లోమీడియా ఛానళ్లు..ఇప్పుడు మాట మార్చాయి. కేవలం 2 లక్షలు దొరికితే 2 వేల కోట్ల అవినీతి బాగోతం జరిగిందని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. అయితే శ్రీనివాస్ ఇంట్లో దొరికిన డైరీ, హార్డ్ డిస్క్ డేటాను పరిశీలిస్తే ఒక ప్రముఖ నాయకుడి 2 వేల కోట్ల అవినీతి బయటపడుతుందని ఐటీ శాఖ అధికారులు ప్రకటించారు.
తాజాగా ఈ 2 వేల కోట్ల స్కామ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఇంత బతుకు బతికి ఇంటెనక… అన్నట్లుగా ఉంది చంద్రబాబు పరిస్థితి. తన దోపిడీ వ్యవహారాల గుట్టంతా మాజీ పిఎస్ శ్రీనివాస్ వద్ద ఉన్నట్టు ఐటి దాడుల తర్వాత క్లియర్ గా అర్థమైంది. మ్యానిపులేషన్లతో వ్యవస్థలను చెరబట్టిన వ్యక్తి చివరకు శ్రీనివాస్ అనే ఉద్యోగి దగ్గర తన ‘పాస్ వర్డ్’ వదిలేశాడు’ అని విమర్శించారు. ‘బాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ కమిట్ మెంటుని మెచ్చుకోవాలి. యజమాని ప్రతి లావాదేవీనీ డైరీలో రాసుకున్నాడు. కంప్యూటర్లో నిక్షిప్తం చేసాడు. ఇంకా అప్పగించాల్సిన పద్దులను అలాగే దాచి ఉంచాడు. దోచుకున్నవి, దొంగదారుల్లో పంపిన లెక్కలన్నిటినీ ఫర్పెక్ట్గా రికార్డు చేసాడు’ అంటూ విజయసాయి రెడ్డి మరో ట్వీట్ చేశారు. మొత్తంగా చంద్రబాబు దోపిడీ గుట్టు అంతా పీఎస్ శ్రీనివాస్ దగ్గర ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.