కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారి కొండపై భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాగా.. సర్వదర్శనానికి 8 గంటలు, శ్రీవారి టైం స్లాట్ సర్వ, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పట్టనుందని టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉంటే.. నిన్న అనగా శనివారం ఒక్కరోజే 81963 మంది భక్తులు వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు.
