తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని మంత్రి వర్గం ఈ రోజు ఆదివారం సాయంత్రం నాలుగంటలకు ప్రగతి భవన్లో భేటీ కానున్నంది. ఈ భేటీలో పలు కీలకమైన అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. అందులో భాగంగా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి మార్చి తొలి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది.
అసెంబ్లీ చివరి సమావేశాలు సెప్టెంబర్ ఇరవై రెండు తారీఖున ముగిశాయి. అయితే మార్చి ఇరవై తారీఖు లోపు మళ్లీ అసెంబ్లీ సమావేశాలు జరపాల్సి ఉంది. అలాగే మార్చి ముప్పై ఒకటో తారీఖులోపు రాష్ట్ర బడ్జెట్ కు ఆమోదం తెలపాల్సి ఉంది.
మూడు వారాల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపడం అనేది గత కొంతకాలంగా వస్తున్న అనవాయితీ. అయితే ఇప్పటికే బడ్జెట్ పై కసరత్తు జరుగుతుంది. అన్ని శాఖల నుండి పలు ప్రతిపాదనలు వస్తున్నట్లు సమాచారం.