ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మరో షాక్ తగలనుంది. టీడీపీ పార్టీ నాయకులపై మరియు తన సన్నిహితుల పై ఎడతెరిపి లేకుండా జరుగుతున్న ఐటీ దాడుల పై తీవ్ర వ్యతిరేకత రావడం తో బాబు కి అసలు నిద్ర పట్టట్లేదు .తాజాగా పశ్చిమ గుంటూరు ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ ఐటీ దాడుల విషయంలో తన సొంత పార్టీ అధినేత చంద్రబాబు గురించే వ్యతిరేకంగా మాట్లాడడం వార్తల్లోకెక్కింది. తాజాగా జరుగుతున్న ఐటీ దాడులపై గిరిధర్ మాట్లాడుతూ ఇప్పుడు బయట పడుతున్న నల్లధనం నుండి టీడీపీ పాలనలో జరిగిన ఎన్నో అక్రమాలు బయట పడుతున్నాయని అన్నాడు. చంద్రబాబు ఎప్పుడు తనను తాను నీతికి నిజాయితీకి మారుపేరు అని చెప్పుకుంటూ ఉంటాడు కానీ ఇప్పుడు తన నాయకులు పై జరుగుతున్న ఐటీ దాడులపై స్పందించకపోవడానికి అర్థం ఏమిటని గిరిధర్ ప్రశ్నించారు.ఇకపోతే చంద్రబాబు నాయుడు పాలనలో జరిగిన కుంభకోణాలు అన్నీ నిదానంగా బయటకు వస్తున్నాయి కాబట్టి తక్షణమే కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకొని బాబు పాలనలో జరిగిన ప్రతి ఒక్క స్కామ్ ను బయటకు తీయాలని అన్నాడు. ఇకపోతే గత సంవత్సరం డిసెంబరు నెల ఆఖరి లో గిరిధర్ సీఎం జగన్ ను కలిశారు. ఆయన వైసీపీ పార్టీలో చేరేందుకు సుముఖత చూపగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తేనే జగన్ పార్టీలో చేర్చుకుంటామని జగన్ అతనికి చెప్పినట్లు తెలిసింది. అయితే ఇప్పుడు అమరావతి విషయం ముదరడంతో ఇదే అదనుగా గిరిధర్ వైసీపీ లోకి ఈ సాకుతో చేరేందుకు సిద్ధమయ్యారు అని అర్థమవుతుంది. అందుకే చంద్రబాబు పై ఎటువంటి విమర్శలు చేస్తున్నాడు. అంతే కాకుండా టీడీపీ లోనే ఉంటే తాను కూడా ఐటీ దాడులు ఎదురుకోవాల్సి వస్తుంది అన్న భయం కూడా అతనిని ఆవహించింది.
