ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో ఇటీవల ఐటీ దాడులు జరిగిన సంగతి విదితమే.
ఈ ఐటీ దాడుల్లో మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో దాదాపు రెండు వేల కోట్ల అవినీతి సొమ్ము దొరికిందని మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. అయితే ఐటీ దాడుల్లో దొరికిన సొమ్ముపై సంబంధిత అధికారులు ప్రకటన చేశారు.
శ్రీనివాస్ ఇంట్లో రూ.2.63లక్షల నగదు,పన్నెండు తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ తన పంచనామాలో పేర్కొంది. ఈ నివేదికపై శ్రీనివాస్,ఐటీ అధికారులు సంతకాలు ఉన్నాయని సమాచారం. అయితే దాదాపు రెండు వేల కోట్లు దొరికినట్లు సాగిన ప్రచారంపై అధికార ప్రతిపక్ష పార్టీలైన వైసీపీ,టీడీపీల మధ్య మాటల వార్ కొనసాగుతుంది.