వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చేసే పనులన్నీ చేసేసి చివరికి ఏమీ తేలినట్టు అందరిని నమ్మించాలని ప్రయత్నిస్తారు. ఈ విషయంలో చంద్రబాబు ట్రైనింగ్ బాగానే ఇచ్చారని ఎద్దేవా చేసారు. “దొంగలను చూసి మొరగాల్సిన కుక్కలు తోకలు ఊపుతున్నాయి. చంద్రబాబు ట్రెయినింగ్ అలాగే ఉంటుంది. దోపిడీదారులు నిప్పు కణికల్లా బిల్డప్ ఇస్తుంటారు. అందరిపైనా వారే నిందలు మోపుతూ, చూశారా మేమొండిన పరమాన్నం ఇంకా చల్లారనే లేదని నీతి సూక్తులు వల్లిస్తుంటారు” అంటూ ట్వీట్ చేసారు. నిజానికి ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది ఎందుకంటే.. చంద్రబాబు చేస్తున్న పనులు చూస్తుంటే ఆయన చెప్పిందే చెప్పినట్టు వారి టీమ్ తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఆ పనులు మంచికి చేస్తే పర్లేదుగాని దారుణంగా ఓడిపోయాక కూడా తప్పుడు పనులు చేయడం సరికాదు.
