నవ్విపోదురుకాని నాకేటి సిగ్గు అంటూ.. చంద్రబాబుపై ఈగ వాలనివ్వను అన్నట్లు పవన్ కల్యాణ్ తీరు ఉంది. కాషాయం పార్టీతో పొత్తుపెట్టుకున్నా..జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు తన రహస్యమిత్రుడు చంద్రబాబుపై మమకారం తగ్గలేదు. ఏపీలో చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై జరిగిన ఐటీ దాడుల్లో 2 వేల కోట్ల రూపాయల అవినీతి బాగోతం బయటపడిన సంగతి తెలిసిందే. టీడీపీ హయాంలో చంద్రబాబు తన అవినీతి సొమ్మును హవాలా ద్వారా విదేశాలకు తరలించి, తిరిగి విదేశీ పెట్టుబడుల పేరుతో బినామీ కంపెనీ ద్వారా తన అకౌంట్‌లోకి మళ్లించుకున్న సంగతి ఐటీ అధికారుల విచారణలో బయటపడింది. ఈ అవినీతి బాగోతంపై పూర్తి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు ఐటీ అధికారులు. ఒక్క పీఎస్‌పై జరిగిన ఐటీ దాడుల్లోనే చంద్రబాబుకు సంబంధించి 2 వేల కోట్ల రూపాయలు స్కామ్ బయటపడితే..ఇంకా గత ఐదేళ్లలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపిస్తే లక్షల కోట్ల స్కామ్ బయటపడుతుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తక్షణమే చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం షరామామూలుగా చంద్రబాబును వెనకేసుకువస్తూ ఓటేసిన ప్రజలను ఘోరంగా అవమానించారు.
తాజాగా మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో గుంటూరుజిల్లా రేపల్లె కార్యకర్తల సమావేశంలో రూ. 2 వేల కోట్ల స్కామ్‌పై పవన్ కల్యాణ్ స్పందించారు. రూ.2వేలకు ఓటు అమ్ముకునే ప్రజలకు.. రూ.2వేల కోట్లు దోచేసిన చంద్రబాబు పీఏ ను ప్రశ్నించే హక్కు లేనేలేదు అంటూ ఘోరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తమ ఓటును 2వేలకో అంతకంటే ఎక్కువకో అమ్ముకుంటూ.. ప్రజలు అవినీతిలో కూరుకుపోయారు. అవినీతి అనే పదం పెద్దదనుకుంటే ప్రజలు ప్రలోభాలకు లొంగిపోయారు అని సరి చేసుకోవచ్చు అంటూ పవన్ వితండవాదన చేశారు.. 2 వేలకు ఓటును అమ్ముకోవడం ద్వారా ప్రజలు.. నాయకులను ప్రశ్నించే లేదా నాయకులపై తిరుగుబాటు చేయగలిగే నైతిక హక్కును కోల్పోయారు. రూ.2వేలకు ఓటు అమ్ముకునే ప్రజలకు.. రూ.2వేల కోట్లు దోచేసిన చంద్రబాబు పీఏ ను ప్రశ్నించే హక్కు లేనేలేదు. ఈ సమాజం చాలా దారుణంగా విచ్ఛిన్నమైపోయింది. అతి దీనావస్థలోకి దిగజారిపోయింది” అంటూ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. గతంలో ఓటుకు నోటు కేసులో మా వాళ్లు బ్రీఫ్డ్‌మీ అంటూ చంద్రబాబు అడ్డంగా దొరికిపోయినప్పుడు కూడా పవన్ కల్యాణ్ వెనకేసువచ్చారు. ఇప్పుడు తన పార్టనర్ మరోసారి 2 వేల కోట్ల స్కామ్‌లో ఇరుక్కుంటే.. 2 వేలకు ఓటును అమ్ముకున్న ప్రజలదే తప్పు అంటూ అడ్డంగా వాదిస్తున్నారు. మా పార్టనర్ 2 వేల కోట్లేంటీ..2 లక్షల కోట్లు అయినా దోచుకుంటాడు..కానీ అడక్కూడదు…ఎందుకంటే మీరు 2 వేలకు ఓటును అమ్ముకున్నారంటూ..ప్రజలను ప్రశ్నించిన పవన్‌ను చూస్తుంటే నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదు..గత ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు, టీడీపీ నేతలు ఓటుకు పది వేలు ఇచ్చినా తీసుకోండి..ఓటు మాత్రం జనసేనకే వేయండి అంటూ పిలుపునిచ్చిన సంగతి పవన్ మరిచారు.ఇప్పుడు తన పార్టనర్ 2 వేల కోట్ల స్కామ్‌లో ఇరుక్కునే సరికి..తట్టుకోలేకపోతున్నాడు..అందుకే 2 వేలకు ఓటును అమ్ముకునే మీకు చంద్రబాబును ప్రశ్నించే హక్కు లేదంటూ ప్రజలను తప్పు పడుతున్నారు..బాబూ పవనూ..చంద్రబాబుపై మీకు ఎంత ప్రేమో అందరికీ తెలుసు కాని..అంతే కానీ ప్రజలపై ఆడిపోసుకోవడం ఎందుకు..ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు ప్యాకేజీకి అమ్ముడుపోయిన ప్యాకేజీ స్టార్ అంటూ వైసీపీ నేతలు చేసే విమర్శలకు నిజమే అనేలా మీ చేష్టలు ఉన్నాయి..మీరు నిజంగా ప్యాకేజీ స్టార్ అని ఈ ఒక్కమాటతో మీకు మీరే ఒప్పుకున్నారు.