టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై జరిపిన ఐటీ సోదాల్లో బయటపడిన 2000 కోట్ల రూపాయల స్కామ్ ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఈ అవినీతి బాగోతంలో చంద్రబాబు చుట్టు ఉచ్చు బిగుసుకుంటోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టు సంస్థలకు పనులు కట్టబెట్టి..వాటి నుంచి కమీషన్లు నొక్కేసేందుకు ఏకంగా బోగస్ కంపెనీలు ఏర్పాటు చేసిన చంద్రబాబు…వేలాది కోట్లను హవాలా ద్వారా విదేశాలకు తరలించి …తిరిగి వాటిని తన బినామీ కంపెనీలకు మళ్లించి, తెలివిగా తన ఖాతాల్లోకి వేసుకున్నాడని ఐటీ అధికారుల విచారణలో వెల్లడైంది.
గత వారం రోజులుగా..చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న ఐటీ శాఖ అధికారులు 2 వేల కోట్ల స్కామ్‌తో పాటు టీడీపీ హయాంలో జరిగిన పలు ఆర్థిక లావాదేవీలు, అవినీతి అక్రమాలపై కూలంకుశంగా ఆధారాలు రాబడుతున్నారంట…శ్రీనివాస్ కూడా ఐటీ అధికారులకు పూర్తిగా సహకరిస్తూ.. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ అవినీతి చిట్టా అంతా విడమర్చి చెప్పినట్లు సమాచారం. షెల్ కంపెనీలు, బినామీల పేరుతో ఉన్న బోగస్ కంపెనీల వివరాలు, హవాలా ద్వారా విదేశాలకు నల్లడబ్బును తరలించి తిరిగి ఎలా బాబు ఖాతాల్లోకి మళ్లించారో..ఇలా అన్ని వివరాలు వివరించారంట.. శ్రీనివాస్ చెబుతున్న ఆర్థిక నేరాల వివరాలు రాబడుతున్న ఐటీ అధికారులు ఓ దశలో ఆయన్ని అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారట..అయితే త్వరలోనే తన కూతురు పెళ్లి ఉందని..ఇప్పుడు అరెస్ట్ చేస్తే తన కూతురు పెళ్లి ఆగిపోతుందని..కాబట్టి..పెళ్లి అయ్యేవరకు అరెస్ట్ చేయద్దు..కావాలంటే మీకు అప్రూవర్‌గా మారిపోతానని ఐటీ అధికారులకు శ్రీనివాస్ లిఖితపూర్వకంగా చెప్పారంట..దీంతో ఐటీ అధికారులు మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రస్తుతానికి శ్రీనివాస్ అరెస్ట్‌ను వాయిదా వేసారంట…అయితే తన కూతురు పెళ్లి కాగానే అప్రూవర్‌గా మారిపోతానన్న శ్రీనివాస్ వాంగూల్మాన్ని ఐటీ అధికారులు వీడియో రూపంలో రికార్డు చేసుకున్నారంట…అలాగే శ్రీనివాస్ ఇంట్లో డైరీ…డాక్యుమెంట్లు…హార్డ్ డిస్క్లు….వీటన్నిటీ సీజ్ చేసిన అధికారులు….ఈ మేరకు సంతకాలు కూడా తీసుకున్నారట. అప్రూవర్‌గా మారుతానని శ్రీనివాస్ లిఖితపూర్వకంగా చెప్పడంతో ఐటీ అధికారులు ఢిల్లీ వెళ్లిపోయారట.
శ్రీనివాస్ కుమార్తె పెళ్లి అయిన వెంటనే ఆయన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లి పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు ఐటీ అధికారులు సిద్ధమవుతున్నారంట..కాగా ఇప్పటికే దొరికిన వివరాలతో బాబు బ్యాచ్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక శ్రీనివాస్ పూర్తి స్థాయిలో నోరు విప్పితే….ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో అన్న టెన్షన్ టీడీపీ నేతల్లో నెలకొంది. నిన్నటివరకు ఐటీ దాడులతో మాకేం సంబంధం అని బుకాయించి, ప్రభుత్వంపై ఎదురుదాడి చేసిన చంద్రబాబు శ్రీనివాస్ అఫ్రూవర్‌గా మారాడు అన్న వార్తలతో వెంటనే అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు. ఐటీ అధికారుల విచారణలో తన పేరు బయటపడితే ఏం చేద్దామంటూ ఆర్థిక నిపుణులు, లాయర్లతో సీక్రెట్‌గా చర్చిస్తున్నాడంట..మొత్తంగా 2 వేల కోట్ల స్కామ్‌లో శ్రీనివాస్ అఫ్రూవర్‌గా మారి తన మాజీ బాస్ చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడనే చెప్పాలి.