Home / ANDHRAPRADESH / 2000 కోట్ల స్కామ్…చంద్రబాబుపై ఏపీ బీజేపీ ఇన్‌చార్జి షాకింగ్ కామెంట్స్…!

2000 కోట్ల స్కామ్…చంద్రబాబుపై ఏపీ బీజేపీ ఇన్‌చార్జి షాకింగ్ కామెంట్స్…!

గత సార్వత్రిక ఎన్నికలకు ముందు మళ్లీ అధికారంలోకి రావడానికి మోదీతో సున్నంపెట్టుకుని, ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు తీరా ఎన్నికలయ్యాక లబోదిబోమంటున్నారు..ఎన్నికలకు ముందు సోనియా, రాహుల్‌తో చెట్టాపట్టాలేసుకుని, దేశమంతటా తిరుగుతూ.. మిష్టర్ మోదీ నిన్ను దించేస్తా..మళ్లీ ఎలా అధికారంలోకి ఎలా వస్తావో చూస్తా…నాకు ఫ్యామిలీ ఉంది..నువ్వు పెళ్లాం వదిలేసినోడివి అంటూ హూంకరించిన చంద్రబాబుకు తీరా ఎన్నికలయ్యాక తాను చేసిన తప్పేంటో తెలిసి వచ్చింది. మళ్లీ మోదీ అధికారంలోకి రావడంతో గత ఐదేళ్లలో చేసిన అవినీతి అక్రమాల్లో ఎక్కడ దొరుకుపోతానో..ఎక్కడ కేసుల్లో ఇరుక్కుంటానో అని భయపడుతున్నారు. అందుకే మోదీ మళ్లీ ప్రధాని అయిన మరుక్షణంలోనే తన నలుగురు రాజ్యసభ ఎంపీలను తెలివిగా బీజేపీలోకి చేర్పించాడు. తనకు అత్యంత సన్నిహితుడైన సుజనా చౌదరితో మళ్లీ మోదీతో కాళ్లబేరానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో బీజేపీని దూరం చేసుకుని తప్పు చేశానని ఏకంగా భారీ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చేశారు.

 

అయితే ..చంద్రబాబు ఎంతగా బీజేపీలోని తన బ్యాచ్‌తో చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్నా…జీవిఎల్, సోమువీర్రాజు వంటి నేతలు పడనివ్వడం లేదు..అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో చంద్రబాబు అవినీతిని, మూడు రాజధానుల విషయంలో టీడీపీ తీరును ఏపీ బీజేపీ నేతలు తీవ్రంగా ఎండగడుతున్నారు. అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌తోపాటు, ఐటీ దాడుల్లో 2 వేల కోట్ల స్కామ్‌తో పాటు వేలాది కోట్ల చంద్రబాబు అవినీతి బాగోతాలు బయటపడుతుండడంతో బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు.

 

తాజాగా బీజేపీ కేంద్ర నేత, ఏపీ బీజేపీ ఇన్‌చార్జి సునీల్ దేవధర్ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయిన చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు గజదొంగ, మోసగాడు, వెన్నుపోటు నేత అంటూ సునీల్ దేవధర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ హయాంలో అమరావతిలో భారీ భూకుంభకోణాలు జరిగాయని, రాజధాని పేరుతో చంద్రబాబు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని దేవధర్ విరుచుకుపడ్డారు. ఓ వైపు కేంద్రంలోని మోదీ సర్కార్ మూడు రాజధానులను అడ్డుకుంటుందని..చంద్రబాబుతో సహా ఎల్లోమీడియా ఛానళ్లు రాజధాని రైతులను మభ్యపెడుతున్నాయి. మరోవైపు జగన్‌‌కు మోదీ, షాలు దగ్గరకు కూడా రానివ్వడం లేదని..కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ప్రచారం చేసిన ఎల్లో బ్యాచ్..ఇప్పుడు జగన్ ఏకంగా ప్రధాని మోదీని, అమిత్‌షా‌ను కలిసిన తర్వాత వైసీపీ ఎన్డీయేలో చేరుతుందని అసత్య ప్రచారం మొదలెట్టింది. మరోవైపు బీజేపీ నేతలు మాత్రం చంద్రబాబును గజదొంగ, మోసగాడు అంటూ దుమ్ముదులిపేస్తున్నారు. సో… బీజేపీకి దగ్గరవ్వాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఏ మాత్రం వర్కవుట్ కావడం లేదు. మొత్తంగా ఐటీ దాడుల నేపథ్యంలో చంద్రబాబు గజదొంగ, మోసగాడు అంటూ ఏపీ బీజేపీ ఇన్‌చార్జి సునీల్ దేవధర్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. మరి ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు, టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat