టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ మంచి ఫామ్ లో ఉన్నట్టే కనిపిస్తున్నాడు. తాజాగా అతడి సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ ఈ నెల 14న విడుదల అయ్యింది. సినిమా విడుదలకు ముందే ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం విజయ్ పై సంచలన దర్శకుడు వర్మ కన్ను పడింది. ఆయన విజయ్ చార్మి కలిసి ఉన్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో పెట్టి వెనుక కాదు కానీ ప్రతి విజయవంతమైన పురుషుడి ముందు, ఒక స్త్రీ ఉంది అని ట్వీట్ చేసాడు. దీనికి ఫ్యాన్స్ ఏవిధంగా అర్ధం చేసుకోవాలో తెలియడంలేదని చెప్పాలి. ఈ ట్వీట్ వెనుక ఎటువంటి భావం వున్నా అది పెట్టింది వర్మ కాబట్టి కొంచెం ఆలోచించక తప్పదు.
