తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నేతను ప్రత్యర్థులు అతికిరాతకంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో సహకార ఎన్నికల్లో కాంగ్రెస్,టీఆర్ఎస్ నేతల మధ్య నెలకొన్న వివాదాలు ఈ హత్యకు కారణమయ్యాయి అని సమాచారం.
ఎల్కారంలో ఇరు వర్గాల మధ్య రెండు రోజులుగా ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఎల్కారం కు చెందిన మాజీ సర్పంచ్,టీఆర్ఎస్ నేత ఒంటెద్దు వెంకన్నను ప్రత్యర్థులు నిన్న శుక్రవారం ఆర్ధరాత్రి దారుణంగా చంపారు.
ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భారీగా అక్కడ మోహరించారు.