తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొన్నది. ప్రముఖ సీనియర్ దర్శకుడు రాజ్ కుమార్ మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకుంటూ ఈ రోజు శనివారం కన్నుమూశారు.
ఆయన మృతదేహాన్ని స్వగ్రామం విజయవాడ సమీపంలోని ఉయ్యూరుకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దర్శకుడు రాజ్ కుమార్ అంత్యక్రియలు అక్కడే నిర్వహించనున్నారు.
అయితే మెగా స్టార్ చిరంజీవి తొలి చిత్రం పునాది రాళ్లకు ఆయన దర్శకత్వం వహించారు. అయితే కొన్ని కారణాల వలన అది విడుదలకు ఆలస్యమైంది. అయితే ఈ సినిమానే రాజ్ కుమార్ కు తొలి సినిమా కావడం విశేషం.ఈ చిత్రానికి ఆయన ఐదు నంది అవార్డులను అందుకున్నారు.