టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొన్నది. ఇండస్ట్రీకి చెందిన యువహీరో నందురీ ఉదయ్ కిరణ్ మృతి చెందాడు. నిన్న శుక్రవారం రాత్రి ఉదయ్ కు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉదయ్ భౌతికాయాన్ని రామారావుపేటలోని హీరో స్వగృహానికి తరలించారు.
ఉదయ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. అయితే ఉదయ్ పరారే,ఫ్రెండ్స్ బుక్ తో పాటు పలు తమిళ సినిమాల్లో హీరోగా నటించారు.