టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ మరియు ఎలిజబుల్ బ్యాచులర్ నితిన్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈమేరకు నితిన్ కు శనివారం ఘనంగా నిశ్చితార్ధం కూడా జరిగింది. దీనికి సంబంధించిన పిక్స్ కొన్ని ట్విట్టర్ లో పెట్టి పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయి అని అన్నాడు. ఇక అసలు విషయానికి వస్తే ఈ ఈవెంట్ కు ముందు రష్మిక మాట్లాడిన మాటలకు నితిన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడట. ఇది స్వయంగా నితిన్ ప్రేక్షకులకు చెప్పడం జరిగింది. ఇంతకు ఆ విషయం ఏమిటంటే రష్మిక నితిన్ ను నువ్వు పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావ్, పెళ్లి అవసరమా అని అనిందంట. ఈ విషయాని నితిన్ ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. ఇదంతా మీడియా ముందు చెప్పడంతో రష్మిక కూడా ఒప్పుకోక తప్పలేదు.