తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శనివారం ఉదయం రూ.10 లక్షల వ్యయంతో పునరుద్ధరణ చేసిన ఆప్తమాలజీ ఆపరేషన్ థియేటర్, రూ.10లక్షలతో కంటి పరీక్షలు నిర్వహించే మిషనరీలను జడ్పి చైర్మన్ రోజా శర్మ ,మున్సిపల్ చైర్మన్ కడవేరుగు రాజనరసు గారితో కలిసి ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు గారు.
** అనంతరం డయాలసిస్ కేంద్రాన్ని సందర్శించి అక్కడి రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత రూ.20లక్షలతో సింగిల్ పర్సన్ ప్లేట్ లెట్ సెంటర్ మిషనరీని మంత్రి గారు ప్రారంభించారు.
** రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు గారు మాట్లాడుతూ..
** ఇవాళ రూ.10 లక్షలతో ఆప్తలమాలజీ సెంటర్, మరో రూ.10లక్షలతో కంటి పరీక్ష మిషనరీలను ప్రారంభించుకున్నాం.
** గతంలో సిద్ధిపేట జిల్లాలో కంటి ఆపరేషన్ థియేటర్ ఎక్కడ లేకుండా కంటి చూపుతో బాధపడే వారికి సమస్యలు ఎదురయ్యేవి.
** ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా సిద్దిపేట, గజ్వేల్లో కంటి ఆపరేషన్ థియేటర్ అందుబాటులోకి తెచ్చాం.
** కంటి చూపుతో బాధపడే వారు, కంటి సమస్యలు ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.
** కంటి వెలుగు కార్యక్రమంలో సమస్యను గుర్తించిన వారిని ఆపరేషన్ చేస్తాం.
** అలాగే ఇవాళ సిద్ధిపేటలో రూ.20 లక్షలతో సింగిల్ పర్సనల్ ప్లేట్లెట్స్ సపరేటర్ ను ప్రారంభించాం.
** డెంగ్యూ, ఇతర వైరల్ ఫీవర్ ఉన్నవారికి ఈ సింగిల్ పర్సనల్ ప్లేట్ లెట్స్ సపరేటర్ ఎంతో మేలు, ఉపయోగకరం. దీనిని ప్రజలు వినియోగించుకోవచ్చు.
** గతంలో ప్లేట్లెట్స్ తో ఇబ్బంది పడేవారు కరీంనగర్ హైదరాబాద్ కి వెళ్లేవారు. కానీ ఇప్పుడా ఆ పరిస్థితి కూడా ఉండదు. సిద్ధిపేట ప్రభుత్వ దవాఖానకు వచ్చి ప్లేట్ లెట్స్ సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు.
** ప్రభుత్వ ఆసుపత్రిలో గతంలో 5 పడకల డయాలసిస్ సెంటర్ మాత్రమే ఉండేదని, ప్రజల అవసరం మేరకు, ప్రజాప్రయోజన దృష్ట్యా మరో 10 పడకల ఆసుపత్రిని విస్తరించాం. మరో 40 వరకు డయాలసిస్ పడకల ఆసుపత్రిగా విస్తరించేందుకు కృషి చేస్తున్నాం.
** వైద్య సేవలు మెరుగ్గా అందటానికి మరిన్ని చర్యలు తీసుకుంటున్నాం.
** సిద్ధిపేటలో 10 పడకల ఐసీయూ సెంటర్ ఉన్నదని, దానిని 20 పడకల ఐసీయూ సెంటర్ గా త్వరలోనే అందుబాటులోకి తేనున్నాం అని చెప్పారు.