అతడు మడిలో పరుత్తుతుంటే అందరూ నిబ్బరపోయారు. అందులోనే అలా పరుగెత్తుతుంటే ఇక ట్రాక్ పై అతడిని వదిలితే దేశానికే వన్నె తెచ్చేలా కనిపిస్తున్నాడు. ఇంతటి గొప్ప వ్యక్తి ఇప్పటివరకు ఇప్పటివరకు ఎవరికీ కనిపించలేదు. సోషల్ మీడియా చొరవతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. అసలు ఈయన ఎవరూ సోషల్ మీడియాకు ఎక్కడ చిక్కాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..!
శ్రీనివాస్ గౌడ్..కొన్నిరోజులు క్రితం అతడు ఎవరికి తెలీదు. కాని ఇప్పుడు సోషల్ మీడియా తో అతడిదే టాపిక్. ఆయనే సూపర్ స్టార్. ఎందుకంటే నయా ఉస్సేన్ బోల్ట్ కాబట్టి. ప్రస్తుతం ఎక్కడ చూసినా ట్విట్టర్ లో ప్రముఖులు అందరు అతడి కోసమే చర్చించుకుంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఇతడు కర్ణాటకకు చెందిన వ్యక్తి. ఇతను ఒక భవన నిర్మాణ కార్మికుడు. కర్ణాటకలోని సంప్రదాయ క్రీడా కంబళ ఇందులోనే ఇతడు అరుదైన ఘనత సాధించాడు. ఇక కంబళ అంటే వరి మడి అని అర్ధం. మడిలో దున్నపోతులను వేగంగా పరిగెత్తిస్తూ వాటి వెనుక ఒక మనిషి పరిగెడతాడు.ఇందులో భాగంగానే శ్రీనివాస్ ఆ దున్నపోతులతో కలిసి 142.4 మీటర్ల దూరాన్ని 13.42 sసెకన్లలో పూర్తిచేసాడు. దీనిప్రకారం చూసుకుంటే 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.55 సెకన్లలోనే పరిగెత్తినట్టే. ఈ పరంగా చూసుకుంటే 100 మీటర్ల దూరాన్ని ఉస్సేన్ బోల్ట్ కంటే 0.3 సెకన్లు ముందుగానే వచ్చినట్టే. ఇలాంటి వ్యక్తిని వెలుగులోకి తీసుకొచ్చి ముందుండి నడిపిస్తే దేశానికి ఎన్నో విజయాలు అందిస్తాడు.