టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నితిన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ యంగ్ హీరో నిశ్చితార్థం శనివారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. పరిమిత సంఖ్యలో సన్నిహితులు, మిత్రులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుకని నిర్వహించారు. షాలిని అనే అమ్మాయిని నితిన్ గత నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని నితిన్ ఇంట్లో చెప్పేయడంతో వారూ ఒప్పుకున్నారు. ఎప్రిల్ 16 నితిన్ వివాహం జరుగనుంది. అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య దుబాయ్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారని తెలిసింది. ప్రస్తుతం నితిన్ ‘భీష్మ’ సినిమాతో బాగా బిజీగా ఉన్నారు. వెంకీ కుడుముల సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన కథానాయికగా నటించారు. ఈ నెల 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.