Home / ANDHRAPRADESH / బ్రేకింగ్…బాబు పీఎస్‌‌పై ఐటీ దాడుల్లో బయటపడుతున్న సంచలన విషయాలు..!

బ్రేకింగ్…బాబు పీఎస్‌‌పై ఐటీ దాడుల్లో బయటపడుతున్న సంచలన విషయాలు..!

టీడీపీ అధినేత చంద్రబాబు పర్సనల్ సెక్రటరీ శ్రీనివాస్‌పై, మరియు టీడీపీ నేతలకు అత్యంత సన్నిహితులపై జరిపిన దాడుల్లో దాదాపు 2 వేల కోట్ల రూపాయల స్కామ్ బయటపడిందని ఐటీ శాఖ ప్రకటించింది. ఇంకా వేల కోట్లు విదేశాల నుండి హవాలా ద్వారా తరలింపు లాంటి అనేక అవినీతి బాగోతాలు బయటపడ్డాయి. బాబు పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో రూ 85 లక్షల అక్రమ నగదు, 75 లక్షల నగలు, 25 బ్యాంక్ లాకర్లు సీజ్ చేసినట్లు ఐటీ శాఖ తెలిపింది. ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు రూ 2,000 కోట్లు చేతులు మారినట్టు ఐటీ అధికారులు భావిస్తున్నారు. పన్ను లెక్కలకు దొరకకుండా రూ 2 కోట్ల లోపు చిన్న మొత్తాల రూపంలో బోగస్ కంపెనీల ద్వారా నిధులు దారి మళ్లించినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ప్రధాన కార్పొరేట్ సంస్థ ఐపీ అడ్రస్ నుంచి సబ్ కాంట్రాక్టర్లు, ప్రధాన కాంట్రాక్టర్లు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినట్లు, గ్రూపు కంపెనీలకు కోట్ల రూపాయల అనుమానిత విదేశీ పెట్టుబడులు వచ్చినట్టు ఐటీ శాఖ విచారణలో తేలింది.

 

అయితే తాజాగా చంద్రబాబు హయాంలో ఈ 2 వేల కోట్ల దోపిడీ ఎలా జరిగిందో ఒక టీవీ ఛానల్‌లో పని చేసే బిజినెస్ అనలిస్ట్ సుకుమార్ కళ్లకు కట్టినట్లు వివరించారు. వ్యవస్థలలో లొసుగులను అడ్డం పెట్టుకుని తెలివిగా దోపిడీ చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు తర్వాతే ఎవరైనా. బాబు హయాంలో పేరెంట్‌ కంపెనీ నుంచి 3 కంపెనీలకు సబ్‌కాంట్రాక్టు కింద పనులు ఇచ్చారు. వాటి నుంచి ఎనిమిది లేయర్ల షెల్‌ కంపెనీలను ఏర్పాటు చేశారు. ఈ చిన్న చిన్న కంపెనీల ద్వారా రూ.2 వేల కోట్లు మళ్లించి ఇసుక కొనుగోళ్లు, లేబర్‌ వేజెస్, సిమెంటు కొనుగోళ్ల పేర్లు చెప్పి డబ్బు మొత్తం సొంత జేబుల్లోకి వేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ డబ్బులు మొత్తం పేరెంట్‌ కంపెనీలో కూర్చొని ఒకే ఐపీ అడ్రస్‌తో విపరీతమైన ట్రాన్సాక్షన్స్‌ అంటే డబ్బు పంపిణీ, ఈమెయిల్స్, వాట్సప్, వెబ్‌ వాట్సప్‌ ద్వారా ఎనిమిదో లేయర్‌లో ఉండే చిన్న చిన్న కంపెనీల ఆపరేషన్స్‌ కూడా చేశారు. ఒక పేరెంట్‌ కంపెనీని పట్టుకుంటేనే రూ.2 వేల కోట్లు తేలింది. ఇలా ఎన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నెన్ని పనులు చేశాయో తేల్చే అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం రూ.2 కోట్ల టర్నోవర్‌ ఉన్న కంపెనీ ఇన్‌కంటాక్స్‌ డిపార్ట్‌మెంట్‌కు కంపెనీకి సంబంధించిన ప్రతి విషయం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటర్నల్‌ ఆడిట్‌ చేసి ఐటీ రిటర్న్స్‌ చేస్తే సరిపోతుంది. దీంతో ఈ ఈ నిబంధనను అడ్డం పెట్టుకొని వందలాది షెల్‌ కంపెనీలను సృష్టించారు. ఎనిమిది లేయర్లలో ఉన్న డైరెక్టర్లు అందరూ అన్ని కంపెనీలలో ఉన్నారు. ఎన్ని కంపెనీలు అయినా ఓపెన్‌ చేయొచ్చు. ఎన్ని కంపెనీలను అయినా మూసేయొచ్చు అనే నిబంధనను వీరు అక్రమ మార్గానికి ఉపయోగించుకున్నారు.

అసలు భారత దేశంలోనే ఇలాంటిది మొదటి కేసు. పేరెంట్‌ కంపెనీ నుంచే 8 లేయర్ల షెల్‌ కంపెనీల మోడస్‌ ఆపరెండీ జరిగిందని ఐటీ నిర్ధారణ చేసింది. ఒక కొత్త కంపెనీ ప్రారంభించినప్పుడు.. కంపెనీ అడ్రస్‌ నుంచి డిజిటల్‌ ఫుట్‌ప్రింట్‌ను పంపించాలి. ఆర్‌ఓసీ(రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌)కి అప్లై చేసేటప్పుడే ఇది చేయాలి. (ఫుట్‌ప్రింట్‌ అంటే కంపెనీ బోర్డు ఫొటో) వీటిని కూడా అక్రమార్కులు ఫ్రాడ్‌ చేశారు. డమ్మీ బోర్డ్స్‌ పెట్టి ఆర్వోసీని తప్పుదోవ పట్టించారు. జియో ట్యాగింగ్‌ వచ్చిన తరువాత అడ్రస్‌ను ట్యాంపర్‌ చేయలేం. వీళ్లు జియో ట్యాంగింగ్‌ను కూడా ట్యాంపర్‌ చేశారు. ఇలా అవినీతి చేయగా వచ్చిన డబ్బులను హవాలా ద్వారా విదేశాలకు పంపించి.. ఇక్కడి నుంచి ప్రైవేటు పోర్ట్స్‌ ద్వారా ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేస్తున్నట్లుగా బిల్లులు సృష్టిస్తారు. ఇక్కడి నుంచి మట్టి పంపించి.. దాన్ని సముద్రంలో పోస్తారు. సరుకు అందింది అని అక్కడ ఉన్న హవాలా క్లయింట్లు వీళ్లకు బ్యాంకు ద్వారా డబ్బులు పంపుతారు. సో..చూశారుగా టీడీపీ హయాంలో వందలాదిగా షెల్‌ కంపెనీల సృష్టించి ఐటీ శాఖను బురిడీ కొట్టించి మరీ…దోచుకున్న వేల కోట్లను హవాలా రూపంలో విదేశాలకు ఎలా తరలించారో. ఈ హవాలా, మనీ లాండరింగ్ బాగోతాలపై ఈడీ, ఐటీ శాఖలు లోతుగా దర్యాప్తు చేస్తే దేశ చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణం బయటపడే అవకాశం ఉంది.మొత్తంగా 2 వేల కోట్ల రూపాయలను ఎలా దోపిడీ చేశారో…బిజినెస్ అనలిస్ట్ సుకుమార్ కూలంకుశంగా వివరించడంతో ఐటీ శాఖ అధికారులే నివ్వెరపోతున్నారు. బాబా..మజాకా… వ్యవస్థలను అడ్డం పెట్టుకుని బినామీల పేరుతో తన పేరు బయటకు రాకుండా తెలివిగా లక్షల కోట్లు అక్రమంగా దోచుకున్నారంటూ.. ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat