Home / ANDHRAPRADESH / 2 వేల కోట్ల స్కామ్‌పై మంత్రి అవంతి శ్రీనివాస్‌ సంచలన వ్యాఖ్యలు…!

2 వేల కోట్ల స్కామ్‌పై మంత్రి అవంతి శ్రీనివాస్‌ సంచలన వ్యాఖ్యలు…!

ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్సనల్ సెక్రటరీతో పాటు లోకేష్ సన్నిహితులకు చెందిన ఇన్‌ఫ్రా కంపెనీలపై జరిగిన ఐటీ రైడ్స్‌ రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి.  టీడీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్‌‌పై జరిగిన ఐటీ దాడుల్లో 2 వేల కోట్ల స్కామ్ బయటపడిందని..ఈ వ్యవహారంలో భారీ కుంభకోణమే ఉందని…వెంటనే కేంద్రప్రభుత్వం విచారణ జరపాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు, ఆ‍యన తనయుడు షెల్‌ కంపెనీల పేరుతో వేల కోట్లు దోచుకుని హవాలా ద్వారా విదేశాలకు తరలించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ రాష్ట్రం విడిచి పారిపోకుండా వారి పాస్‌పోర్ట్‌లను సీజ్ చేసి మరీ విచారణ జరపాలని రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. 25 ఏళ్లుగా శ్రీనివాస్‌ చంద్రబాబు దగ్గర పనిచేశాడని, దొంగ కంపెనీలను సృష్టించి దోచుకున్న డబ్బును విదేశాలకు పంపించారని ఆరోపించారు. చంద్రబాబును, ఆయన బినామీలను, లోకేశ్ ను విచారిస్తే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు దొరుకుతాయో అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.

చంద్రబాబు హయాంలో దోపిడీ రాజ్యం నడిచిందని, గత ఐదేళ్లలో లక్షల కోట్ల రూపాయలను టీడీపీ నేతలు విచ్చల విడిగా దోపిడీ చేశారని దుయ్యబట్టారు. గతంలో ఏ నాయకుడు చేయని విధంగా టీడీపీ హయాంలో చంద్రబాబు ఎన్నో అక్రమాలు చేశాడని , భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. మొన్న ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా ఆ పార్టీ నేతల్లో మార్పు రాలేదని అవంతి ఫైర్ అయ్యారు..ఐటీ దాడులకు, వైసీపీ ప్రభుత్వానికి సంబంధం లేదని.. టీడీపీ నేతలు కావాలనే సీఎం జగన్ ని, వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు.. చంద్రబాబు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి గురించి నాడు మోదీకి తెలియడం వల్లే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు నాడు రాలేదని మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. తక్షణమే చంద్రబాబు, లోకేశ్ లను విచారించాలని, వారి పాస్ పోర్టులను సీజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.నిందితులు ఎంత పెద్ద వారైనా సరే వారిని శిక్షించాలని మంత్రి అవంతి శ్రీనివాస్ కోరారు. మొత్తంగా చంద్రబాబు, లోకేష్‌ల పాస్‌పోర్ట్‌లు సీజ్ చేయాలంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో సర్వత్రా హాట్‌టాపిక్‌గా మారాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat