భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ‘దాదా’ గా ప్రసిద్ధి. భారత క్రికెట్ యొక్క దిగ్గజ వ్యక్తులలో గంగూలీ ఒకరు. అంతేకాకుండా అతడిని ‘మోడరన్ ఇండియన్ క్రికెట్ యొక్క రూపం’ అని కూడా పిలుస్తారు. 1990 సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం తరువాత గంగూలీ భారత జట్టు భాధ్యతలు తీసుకొని ఇండియా అంటే బలమైన జట్లలో ఒకటిగా నిలిచేలా చేసాడు.తన ఆఫ్ మరియు ఆన్-ఫీల్డ్ దూకుడు మరియు మ్యాన్-మేనేజ్మెంట్ నైపుణ్యాలతో, గంగూలీ భారత క్రికెట్లో ‘దాదా’ బిరుదును కొనుగోలు చేశాడు. ఇప్పుడు దాదాపు రిటైర్మెంట్ అయిన 10సంవత్సరాలు తరువాత ఎంతో ప్రతిష్టాత్మకమైన బీసీసీఐ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు.
ఇక ఇటీవలే గంగూలీ తన మెమరీ ఒకటి అంటే 1996లో లార్డ్స్ వేదికగా తన మొదటి మ్యాచ్ లోనే ఇంగ్లాండ్ పై సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్ లో ముఖ్యంగా చెప్పాలంటే ఇండియా గెలవడానికి ప్రధానపాత్ర గంగూలీ నే. కాని మ్యాచ్ చివరికి డ్రాగా ముగిసింది. దానికి సంబంధించి ఒక పిక్ ను గంగూలీ సోషల్ మీడియాలో పెట్టి మరుపురాని సంఘటనలు అని పెట్టాడు. దానికి ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సరదాగా కామెంట్ చేసారు. “దాదా లోగో టో హటా లో ! మీరు ఒక భాద్యతగల ప్రెసిడెంట్ పదవిలో ఉన్నరు అని కామెంట్ చేసాడు.