ఇటీవల బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఎంపీ స్టిక్కర్ తో స్కార్పియో వాహనంలో యువకులు ఇటీవల కొందరు యువకులు రాజధాని ప్రాంతంలో హల్ చల్ చేస్తున్నారు. స్కార్పియో వాహనానికి ఎంపీ స్టిక్కర్ నేమ్ బోర్డ్ తో మంగళగిరిలోనూ తాజాగా హల్ చల్ చేసారు. ఈ క్రమంలో సురేష్ పేరుతో గత 15రోజులుగా దందాలు సాగించారు. అలాగే మంగళగిరి పోలీస్ స్టేషన్లో ల్యాండ్ విషయంలో ఎంపీ సురేష్ పేరుతో మరో దందా చేసారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ సురేష్ స్వయంగా మంగళగిరి వచ్చి యువకులను మందలించారు. వాహనానికి ఉన్న స్టిక్కర్ ను నేమ్ ప్లేట్ ను తొలగించారు.అంతేకాదు.. గత నెల రోజులుగా తాము చేసిన దందాలకు ఎంపీ సురేష్ గారికి ఎటువంటి సంబంధం లేదని మంగళగిరి స్టేషన్లో యువకులు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు.
