టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజాబెల్లె హీరోయిన్లుగా వచ్చిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈ చిత్రం ఈ రోజు ప్రేమికులు రోజు సందర్భంగా విడుదల అయ్యింది. ఈ చిత్రానికి గాను మాధవ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి వీడియో లేదా ఫోటో వచ్చినా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. దానికి తోడు విజయ్ చేసిన ప్రొమోషన్లకి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. దాంతో షోలు పరంగా కూడా బుకింగ్ లు ఫుల్ అయ్యాయి. దాంతో సినిమా సూపర్ హిట్ అవుతుందని అందరు భావించారు. కాని సినిమా చూసి బయటకు వచ్చిన తరువాత తెలిసింది సినిమాలో ఎంత జోష్ ఉంది అనేది. సినిమా పరంగా ఫస్ట్ హాఫ్ యావరేజ్ టాక్ వచ్చినప్పటికే ఇక సెకండ్ హాఫ్ అయితే అస్సలు బాలేదనే టాక్ వస్తుంది. అది కూడా సినిమా మొత్తంలో ఒక విజయ్ నటన తప్పా చూడతగ్గవి ఏమీ లేవని అంటున్నారు. సినిమా ఎలా ఉన్నప్పటికీ ఎంటర్టైన్మెంట్ అనేది కరువైంది. మరి ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా అర్ధం చేసుకుంటారో మరి. చివరిగా విజయ్ దేవరకొండకు ఈ సినిమా మరో ఫ్లాప్ అనే చెప్పాలి.
