దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ ఘనవిజయం సాధించింది. భారతీయ జనత పార్టీ ఓడిపోయింది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఖాతా తెరవకుండానే సద్దుకున్నారు. మొత్తం 70 స్థానాలకు గాను ఆప్ 62 గెలుచుకోగా, బీజేపీ 08, కాంగ్రెస్ 0 తో సరిపెట్టుకున్నాయి. కేజ్రివాల్ కు ఇది గొప్ప రికార్డు విజయం. ఈ విజయంతో వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సీఎంగా నిలిచాడు. ఇకఅసలు విషయానికి వస్తే ఈ నెల 16న అనగా ఆదివారం ఆయన ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీని ఆహ్వానించారని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.
