ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఫెబ్రవరి 6 నుండి 10వరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ఇంట్లో సోదాలు జరిగిన విషయం అందరికి తెలిసిందే. చంద్రబాబు కమీషన్ల బాగోతాన్ని బట్టబయలు చేసింది ఆదాయపు పన్ను శాఖ. అయితే ఈ అకస్మాతు దాడుల దెబ్బకు పీఏ ఇంట్లో ఏకంగా 2వేల కోట్లు దొరికాయి. దీంతో ఒక్కసారిగా అందరు షాక్ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఐటీ శాఖ దగ్గర ఉన్నాయి. అయితే ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి నా 40ఏళ్ల రాజకీయ జీవితంలో నాపై ఎలాంటి ఆరోపణలు, కేసులు లేవని..ఇప్పుడున్న ప్రభుత్వం నాపై కావాలనే కక్షగట్టి ఆరోపణలు మోపుతున్నారని, దీనివల్ల ప్రజలు, వ్యాపారులు బయపడుతున్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా ఈ నెల 19నుండి ప్రజాచైతన్య యాత్రం చేస్తామని అన్నారు. దీనిపై స్పందించిన కొందరు నాయకులు చంద్రబాబుకి ఇది కొత్తేంకాదని ప్రస్తుతం ఈ ఐటీ దాడుల విషయంలో ఆయన తప్పించుకోవాలనే ఇలాంటి మాటలు బయటకు వస్తున్నాయని చెప్పుకొస్తున్నారు. ప్రజలకు మంచిపని చేస్తే ఓర్వలేని చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాలని ప్రయత్నించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అర్దమైంది. తాజాగా ఇప్పుడు ఐటీ దాడుల విషయంలో ఎక్కడ దొరికిపోతానో అని బయపడి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అందరూ అంటున్నారు.