ప్రతీ ఏడాది ఫిబ్రవరి 14 వస్తుందంటే చాలు యువ హృదయాలన్నీ గిఫ్ట్స్ వైపే కన్నేస్తాయి. తాము ఎంతగానో ప్రేమించే వ్యక్తికి ఈ రోజున సూపర్ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేయాలని ఆరాటపడుతుంటాయి. అయితే ఈ గిఫ్ట్స్ వారి వారి అభిరుచులు, ఆర్ధిక స్తోమతను బట్టి ఉంటాయి. కాగా తాజాగా ఈ విషయమై స్పందించిన యాంకర్ రష్మీ మీ లవర్స్‌కి మీకు నచ్చిన గిఫ్ట్స్ ఇవ్వండి కానీ పెంపుడు జంతువులను మాత్రం కానుకగా ఇవ్వకండి అంటూ సోషల్ మీడియాలో సందేశం పోస్ట్ చేసింది రష్మి. కొందరు కుక్కపిల్లల్ని, పిల్లుల్ని పెంచుకోమని గిఫ్ట్స్‌గా ఇస్తుంటారు. అయితే ఇచ్చింది లవర్ కదా అని ఆ రోజు వరకు వాటిని ప్రేమగా చూసుకుని కొన్నిరోజుల తర్వాత పట్టించుకోవడం మానేస్తుంటారు. అలాంటి పనులు మాత్రం అస్సలు చేయొద్దంటూ యాంకర్ రష్మీ రిక్వెస్ట్ చేసింది. మీ ప్రేమికులకు ఇలాంటి కానుక వద్దు ‘పిల్లులు, కుక్కలను పెంచుకోవాలంటే.. ఫైనాన్షియల్‌గా, ఎమోషనల్‌గా ఓ ఫ్యామిలీ పది నుంచి పదిహేనేళ్ల వరకు కాపాడుకోవాలి. ఈ వ్యాలెంటైన్స్ డే రోజున దయచేసి జంతువులను కొని వాటిని మీ ప్రేమికులకు కానుకలుగా ఇవ్వకండి’ అని రష్మీ తెలిపింది. రష్మీ చూసిన పోస్ట్ చూసిన నెటిజన్స్ ‘సుధీర్ రష్మీ ఏమంటోందో నీకు అర్థమైతోందా’ అంటూ కామెంట్స్ పెడుతుండటం విశేషం. నిజంగా జంతువలను ప్రేమించే వాళ్లు అవటే వీరే అంటున్నారు.
— rashmi gautam (@rashmigautam27) February 12, 2020