మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాజీ వ్యక్తిగత కార్యదర్శి కమీషన్ల బాగోతాన్ని ఆదాయ పన్ను శాఖ బట్టబయలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. చంద్రబాబు‘పర్సనల్ సెక్రటరీని పట్టుకుంటేనే రూ.2వేల కోట్లు బయటపడ్డాయి. మరి చంద్రబాబును పట్టుకుంటే… ఎన్ని వేల కోట్లో! లక్షల కోట్లు అడ్డంగా సంపాదించారన్నది అక్షరాల నిజం కాదా? ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలి?’ అని ఆయన ట్విట్ చేశారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఫిబ్రవరి 6 వ తేదీ నుంచి హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖపట్నంతో పాటు పుణె సహా 40 ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో మొత్తంగా 2 వేల కోట్ల రూపాయల మేరకు అక్రమంగా తరలించారన్న వార్తపై ఆయన ఈ వ్యాఖ్య చేశారు.
