ఢిల్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విక్టరీ కొట్టి మూడోసారి ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ఫిబ్రవరి 1న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మామూలుగా అయితే ఈపాటికి టీడీపీ అధినేత చంద్రబాబు హడావుడి ఓ రేంజ్‌లో ఉండేది. నా వల్లే..కేజ్రీవాల్ విజయం సాధించాడని బాబు డప్పుకొట్టుకునేవారు..ఇక మా బాబు రాజకీయ చాణ్యకం, ఆర్థిక సహాయసహకారాల వల్లే.. కేజ్రీవాల్ గెలిచారని..ఇక మోదీకి ముందుంది ముసళ్ల పండుగ అని ఆయన అనుకుల మీడియా ఓ రేంజ్‌లో భజన చేసేది. కాని చంద్రబాబు ఇప్పుడు మళ్లీ మోదీ పంచన చేరడానికి నానాపాట్లు పడుతున్నారు. ఒకవైపు సీఎం జగన్ ప్రధాని మోదీకి దగ్గర కాకుండా బాబు నానాపాట్లు పడుతున్నారు. ఈ మేరకు ముందుగా తన రహస్య స్నేహితుడు పవన్‌కల్యాణ్‌ను పంపించి జనసేనకు, బీజేపీతో పొత్తుకుదుర్చారు. అందుకే ఇప్పుడు కేజ్రీవాల్ విజయాన్ని చంద్రబాబు స్వాగతించలేకపోతున్నారు..ఎక్కడ కేజ్రీవాల్‌కు కంగ్రాట్స్ చెబితే మోదీకి కోపం వస్తుందేమోనని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు కూడా చెప్పలేదు.
అయితే ఇదే విషయంపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా స్పందిస్తూ..చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏ రాష్ట్రంలో సీఎం ప్రమాణ స్వీకారం ఉన్నా నమ్మకస్థులను పంపి ఇన్విటేషన్ సంపాదించేవాడు. ఎన్డీయేలో లేకున్నా ఇప్పుడు కేజ్రీవాల్ పదవీ ప్రమాణానికి వెళ్లే దమ్ము లేదు. బీజెపీ పెద్దల కంట్లో పడితే పాత కేసులు ఎక్కడ తిరగతోడతారో అని వణుకుతున్నాడు. అప్పట్లో గిరగిరా తిప్పిన చక్రాలు ఏమయ్యాయో? అంటూ చంద్రబాబును ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
అలాగే చంద్రబాబు అనుకూల మీడియాను ఉద్దేశించి కూడా విజయసాయిరెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. బాబు సీఎంగా లేని ఆంధ్ర రాష్ట్రం నాశనమై పోవాలని కిరసనాయిలు కోరుకుంటున్నాడు. సీఎం జగన్ గారు రాష్ట్ర సమస్యల గురించి గంటన్నర సేపు ప్రధాని మోదీ గారితో సమావేశమైతే పిపిఏలపై మందలించాడని సైనైడ్ వార్తలు కుమ్మరించాడు… జయము జయము చంద్రన్న భజన పరాకాష్ఠకు చేరిందంటూ బాబుకు భజన చేసే పత్రికాధిపతిని ఉద్దేశిస్తూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు, ఆయన బానిస మీడియా ఇంతగా కుళ్లుకుంటున్నారంటే.. తిన్నది ఒంటబట్టడం లేదు. కంటి నిండా నిద్ర పోవడం లేదని తెలిసిపోతోంది. దోపిడీ రోజులు పోయాయి. నిజాయితీ, విశ్వసనీయతల విలువేమిటో ప్రజలు గ్రహించారు. పచ్చ తెరల లోకం నుంచి బయటకు రండి. మా కోడి కూస్తేనే తెల్లారుతుందనుకుంటే ఎలా? అంటూ చంద్రబాబు అనుకుల మీడియాకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చురకలు అంటించారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.