కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి నిధులు తీసుకురావడంలో వైసీపీ ఎంపీలు ఫెయిలయ్యారని టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. 22 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు..ముఖ్యంగా విజయసాయిరెడ్డి ఏం చేస్తున్నారు..కేంద్రాన్ని నిలదీసి నిధులు తీసుకురాలేకపోతున్నారంటూ అడ్డగోలుగా మాట్లాడారు. అయితే వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బెస్ట్ పార్టిసిపెంట్ అని రాజ్యసభ సెక్రటేరియట్ వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన బులెటిన్‌లో ఈ సారి జరిగిన బడ్జెట్ సమావేశాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రశంసనీయమైన రీతిలో.. క్రియాశీల పాత్రను నిర్వహించారని రాజ్యసభ సెక్రటేరియట్ ప్రకటించింది.
ప్రజా సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో తనకు గల అవకాశాలను రాజ్యసభలోని ఇతర సభ్యుల కన్నా విజయసాయిరెడ్డి చాలా చక్కగా వినియోగించుకున్నారని పేర్కొంది. రాజ్యసభలో మొత్తం 323 సందర్భాల్లో వివిధ రూపాల్లో 155 మంది తమ గళాన్ని వినిపిస్తే అందులో 83 మంది రెండు కంటే ఎక్కువ సార్లు చర్చల్లోనూ, ప్రత్యేక సూచనలు ఇచ్చే విషయంలోనూ పాల్గొన్నారు. విజయసాయిరెడ్డి 9 సందర్భాల్లో తన గళాన్ని వినిపించారు. జీరో అవర్ ప్రస్తావన, ప్రత్యేక ప్రస్తావన, ఒక మౌఖిక ప్రశ్న, మౌఖిక ప్రశ్నలకు 4 అనుబంధ ప్రశ్నలు అడిగారని రాజ్యసభ సెక్రటేరియట్ తెలిపింది. వీటన్నింటితో పాటు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చలో కూడా విజయసాయిరెడ్డి చక్కగా మాట్లాడారని ప్రశంసించింది.
కాగా కేంద్రంలోని మోదీ సర్కార్ నిధుల కేటాయింపులో దక్షిణాది రాష్ట్రాలకు మొండి చేయి చూపడం షరామామూలే..వైసీపీ ఎంపీలు ఎంతగా ప్రయత్నించినా..కేంద్రం పైసా విదిల్చడం లేదు..ఒక్క ఏపీకే కాదు తెలంగాణకు కూడా నిధుల కేటాయింపుల్లో పెద్దగా ఒరిగబెట్టిందేమి లేదు. గతంలో కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి వివక్ష చూపారనే సాకుతోనే చంద్రబాబు ఎన్డీయే గవర్నమెంట్ నుంచి బయటపడింది. అయినా వైసీపీ నేతలు మాట్లాడలేదంటూ దిగజారుడు వ్యాఖ‌్యలు చేస్తున్నారు. అయితే బడ్జెట్ సమావేశాల్లో విజయసాయిరెడ్డి బెస్ట్ పార్టిసిపెంట్ అంటూ రాజ్యసభ సెక్రటేరియట్ ప్రశంసలు కురిపించడంతో టీడీపీ నేతల నోర్లు మూతబడ్డట్లైంది. మొత్తంగా ఢిల్లీకి, వైజాగ్‌కు తిరగడమే తప్పా…విజయసాయిరెడ్డి ఏం చేస్తున్నారంటూ టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు రాజ్యసభ సచివాలయమే సమాధానం చెప్పింది.
ఈ వార్తతో ఇప్పుడు చెప్పండి తమ్ముళ్లు..వాట్ టు డూ..వాట్ నాట్ డూ..అంటూ వైసీపీ శ్రేణులు టీడీపీ నేతలకు కౌంటర్ ఇస్తున్నారు.