దిశ ఉదంతం తర్వాత లేటుగా అయినా గీత హత్యాచార ఘటన తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుంది. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే గీత హత్య జరిగింది..కర్నూలుకు చెందిన ఎస్.రాజు నాయక్, ఎస్.పార్వతిదేవి దంపతుల 15 ఏళ్ల కుమార్తె అయిన సుగాలి ప్రీతి స్థానిక కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్‌లో పదో తరగతి చదివేది. 2017 ఆగస్టు 19న ప్రీతి స్కూల్లోనే అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. ప్రీతి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయినట్లు స్కూల్ యాజమాన్యం చెబుతోంది. కాని తమ కుమార్తె ఉరి వేసుకుని చనిపోలేదని, స్కూల్ యజమాని కొడుకులు బలవంతంగా రేప్ చేసి చంపేశారని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. కాగా ఆ స్కూల్ టీడీపీ నాయకుడికి చెందినది కావడంతో గత బాబు సర్కార్ ఈ కేసును నీరుగార్చింది. ఇప్పటి వరకు బాధితులకు న్యాయం జరుగలేదు. అయితే హత్యాచారానికి గురైన బాధితురాలి పేరును ఇప్పుడు గీతగా మార్చారు.
తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ గీతకు న్యాయం చేయాలంటూ కర్నూలులో ధర్నా నిర్వహించారు..గీత కేసును సీబీఐకి అప్పగించాలని పవన్ ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేశారు. గీత కుటుంబానికి న్యాయం చేయాలని లేదంటే వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అనుకోవాల్సి వస్తుందని…ఈ విషయాన్ని మానవహక్కుల సంఘం వరకు తీసుకువెళతానని,అవసరమైతే నిరాహారదీక్ష చేస్తానని పవన్ హచ్చరించారు. అయితే పవన్ ధర్నాకు ముందే కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్ప గీత కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. గీత కేసును అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నామని, సీబీఐ దర్యాప్తు కోసం కేంద్ర హోంశాఖకు ప్రతిపాదనలు పంపించామని ఎస్పీ వెల్లడించారు. గీత కేసుపై సీబీఐ విచారణ జరపాలని కేంద్ర హోం శాఖకు ప్రతిపాదనలు పంపామని ఎస్పీ చెప్పిన తర్వాత కూడా పవన్ కల్యాణ్ ధర్నా చేసి మళ్లీ ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ రాజకీయం చేశారు.
అయితే గీత కుటుంబానికి న్యాయం చేయాలంటూ కర్నూలులో ర్యాలీ చేపట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మండిపడ్డారు. గీత కేసులో ఎఫ్ఐఆర్,చార్జిషీట్ వేసింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అని హఫీజ్ గుర్తుచేశారు. బాబు హయాంలో ఈ కేసుపై మాట్లాడని పవన్ ఇప్పుడు ధర్నాలు చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. బాధితురాలి తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు జరిగిన ఘటనపై మళ్లీ విచారణ జరిపిస్తున్నామని, విచారణ కోసం ఓ మహిళా అధికారిణిని కూడా ప్రభుత్వం నియమించిందని హఫీజ్ ఖాన్ తెలిపారు. చంద్రబాబు హయాంలో జరిగిన ఘటనను వైస్ జగన్ ప్రభుత్వంలో జరిగినట్టుగా పవన్ మాట్లాడుతున్నారని హషీజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. . చంద్రబాబు సూచన మేరకే కర్నూలు వచ్చారా? అని పవన్‌ను నిలదీశారు. గీతకు జరిగిన అన్యాయంపై పవన్ చంద్రబాబును నిలదీయాలన్నారు అదే సమయంలో రేణు దేశాయ్ విషయంలో పవన్‌పై హఫీజ్ ఖాన్ పలు వ్యాఖ్యలు చేశారు. పవన్ వల్ల రేణు దేశాయ్ ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలుసన్నారు. గీతకు న్యాయం చేయాలని పవన్ డిమాండ్ చేయడంలో తప్పులేదని..కాని ముందుగా తర వల్ల అన్యాయమైపోయిన రేణూదేశయ్‌కు న్యాయం చేయాలని హఫీజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కనీసం హత్యాచారానికి గురైన బాలిక పేరు ప్రస్తావించకూడదన్న ఇంగీత జ్ఞానం కూడా పవన్ కల్యాణ్‌కు లేదని ఆక్షేపించారు. . మొత్తంగా చంద్రబాబు హయాంలో గీత హత్యాచార ఘటనపై మాట్లాడని పవన్ ఇప్పుడు ధర్నాలు చేస్తూ రాజకీయం చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.