Home / ANDHRAPRADESH / ఈ టీడీపీ నేత మామూలోడు కాదు.. ఏకంగా ఏపీ మంత్రి సంతకాన్నే ఫోర్జరీ చేశాడు..!

ఈ టీడీపీ నేత మామూలోడు కాదు.. ఏకంగా ఏపీ మంత్రి సంతకాన్నే ఫోర్జరీ చేశాడు..!

టీడీపీ నేతలు వరుసగా భూకబ్జాల కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరుపుతున్న సీఐడీ అధికారులు తెల్లకార్డుదారుల పేరుతో భూములు కొనుగోలు చేసిన టీడీపీ నేతలపై ఈడీతో కలిసి సమాంతరంగా విచారణ చేస్తున్నారు. దీంతో రాజధాని జిల్లాల టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా మరో టీడీపీ నేత అసైన్డ్ భూములను అక్రమంగా కాజేసేందుకు ఏకంగా రాష్ట్ర మంత్రి సంతకాన్నే ఫోర్జరీ చేసి దొరికిపోవడం పార్టీలో కలకలం రేపుతోంది. తాజాగా కడప జిల్లాకు చెందిన రెడ్డప్ప అనే టీడీపీ నేత తన సంతకాన్ని, తన లెటర్‌హెడ్‌ను ఫోర్జరీ చేశారంటూ ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనిత హోం మంత్రి సుచరితకు , డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఫిర్యాదు చేశారు. తన లెటర్ హెడ్‌ను, సంతకాన్ని ఫోర్జరీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డీజీపీని, హోం మంత్రిని కోరారు.

 

వివరాల్లోకి వెళితే..   కడప జిల్లాకు, దేవలంపేట గ్రామానికి చెందిన రెడ్డప్ప అనే టీడీపీ నేత తన గ్రామంలో ఎకరంన్నర  అస్డైన్డ్ భూమిని కాజేయాలని పన్నాగం పన్నాడు. ఇందుకోసం ఏకంగా ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనిత పేరుతో ఓ లెటర్ హెడ్ క్రియేట్ చేశాడు. ఫలానా దేవలంపేటకు చెందిన రెడ్డప్పకు చిన్నతరహా పరిశ్రమ పెట్టుకోవడానికి ఎకరంన్నర అసైన్డ్ భూమిని కేటాయించమంటూ జిల్లా కలెక్టర్‌కు, మేజిస్ట్రేట్‌కు మంత్రి తావేటి రికమెండ్ చేస్తున్నట్లు ఫోర్జరీ చేసిన లెటర్ హెడ్‌పై రాయించాడు..ఆ‌ఖరకు మంత్రి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశాడు. అయితే ఈ లెటర్‌హెడ్‌పై మంత్రి వనిత సంతకాన్ని తప్పుగా పెట్టడంతో రెడ్డప్ప అధికారులకు దొరికిపోయారు. అతను టీడీపీ నేత కావటంతో స్థానికంగా అది చర్చనీయాంశం అయ్యింది. కాగా తన లెటర్‌హెడ్, సంతకం ఫోర్జరీ అయిందని విషయాన్ని తెలుసుకున్న మంత్రి తావేటి వనిత ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకుని హోంమంత్రికి, డీజీపీకి ఫిర్యాదు చేశారు. తక్షణమే సదరు రెడ్డప్ప అనే టీడీపీనేతపై చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మొత్తంగా కడప జిల్లాకు చెందిన టీడీపీ నేత ప్రభుత్వ అసైన్డ్ భూముల కోసం ఏకంగా మంత్రి లెటర్ హెడ్, సంతకాన్ని ఫోర్జరీ చేసి కలెక్టర్‌కు సిఫార్సు లేఖ పంపటంపై రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికారంలో లేకపోయినా టీడీపీ నేతలు ఎలా అక్రమంగా భూములు కబ్జాలు చేస్తున్నారో ఈ ఉదంతం ద్వారా తెలుస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat