ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటీవల ఢిల్లీకి వెళ్ళిన సంగతి విదితమే. ఈ పర్యటనలో ప్రధానమంత్రి నరేందర్ మోదీని కలిశారు.
ఈ భేటీలో విభజన హామీలపై.. మండలి రద్దు.. మూడు రాజధానుల అంశాలపై చర్చ జరిగింది. ఈ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కావాల్సి ఉండగా ఆయన బిజీ షెడ్యూల్ వలన కుదరలేదు.
దీంతో ముఖ్యమంత్రి జగన్ మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. దీనికోసం రేపు సాయంత్రం ఆరుగంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి సీఎం జగన్ చేరుకోనున్నారు.