ముచ్చటగా మూడోసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసిన ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా మరో రికార్డును సొంతం చేసుకుంది కేవలం 24 గంటల్లోనే దేశ వ్యాప్తంగా పది లక్షల మంది(1 మిలియన్) ఆ పార్టీలో భాగస్వామ్యం అయ్యారు. ఢీల్లి ఎన్నికలు ఫలితాలు వెలువడ్డ మరుసటి రోజు ఆమ్ ఆద్మీ తమ పార్టీలో భాగస్వామ్యం అయ్యేందుకు ఓ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలని సూచించింది. కాగా అనూహ్యంగా ఒక్క రోజులోనే దాదాపు 11 లక్షల మంది ఈ క్యాంపెయిన్‌లో భాగస్వాములు అయ్యారు. దీనిపై పార్టీ స్పందిస్తూ.. ‘ఒక్క రోజులోనే 11 లక్షల మంది పార్టీలో భాగస్వామ్యం అయ్యారు. ఇది భారీ విజయం’ అంటూ ట్వీట్ చేసింది. మరోవైపు ప్రజల నుంచి ఇంత భారీ ఎత్తున స్పందన లభించడం చరిత్రాత్మకమని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
More than 1 million people have joined AAP within 24 hours of our massive victory.
To join AAP, give a missed a call on :
9871010101#JoinAAP pic.twitter.com/o79SV8bj01— AAP (@AamAadmiParty) February 13, 2020