ట్రై సిరీస్ ఫైనల్ లో భారత్ చేతులెత్తేసింది. ఆస్ట్రేలియాపై 11పరుగుల తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాట్టింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20ఓవర్స్ లో 6వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఓపెనర్ బెత్ మూనీ 71 పరుగులతో అజేయంగా నిలిచింది. అనంతరం చేజింగ్ కి వచ్చిన భారత్ ఓపెనర్ మందానా తప్పా అందరు చేతులెత్తేశారు. దాంతో ఫైనల్ లో ఓటమి పాలయ్యారు. ఆమె 37బంతుల్లో 66 పరుగులు చేసింది.ఇందులో 12బౌండరీలు ఉన్నాయి. ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ జెస్ జోనస్సేన్ ఏకంగా 5వికెట్లు తీయడంతో భారత్ 144 పరుగులకే ఆల్లౌట్ అయ్యింది. భారత్ ఫెబ్రవరి నెల కలిసి రాలేదనే అనాలి ఎందుకంటే అటు అబ్బాయిలకు, ఇటు అమ్మాయిలకు ఓటములు ఎదురయ్యాయి.