న్యూజిలాండ్ టూర్ లో భాగంగా భారత్ టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం వన్డే సిరీస్ ప్రారంభం కాగా భారత్ మూడు మ్యాచ్ లు ఓడిపోయింది. దాంతో భారత్ పై కివీస్ వైట్ వాష్ చేసి ప్రతీకారం తీర్చుకుంది. అయితే టీ20 సిరీస్ గెలవడంతో భారత జట్టు అన్ని విభాగాల్లో స్ట్రాంగ్ గానే ఉంది అని అనుకున్నారంతా. కాని వన్డే సిరీస్ ఓడిపోయిన తరువాతే తెలిసింది అంచనాలు తలకిందులు అయ్యాయి అని. ఈ ఓటమికి కోహ్లి సమాధానం కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ఓటమికి అసలు కారణం కోహ్లి, బూమ్రా అనే అంటున్నారు. ఎందుకంటే వన్డేలలో వీరిద్దరూ నెంబర్ వన్ బాట్స్ మెన్ మరియు బౌలర్ గా ఉన్నారు. కాని గత కొంతకాలంగా కోహ్లి ఒక్క సెంచరీ కూడా చెయ్యలేదు మరోపక్క బూమ్రా అంతగా రాణించలేదు.
