ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మాయిల రక్షణ కొరకు సంచలణాత్మక చట్టం తీసుకొచ్చిన విషయం అందరికి తెలిసిందే. అదే దిశ చట్టం. దీనికి సంబంధించి జగన్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించారు. అంతేకాకుండా యాప్ ఒకటి మొదలుపెట్టారు. అమ్మాయిలకు ఎలాంటి ప్రమాదం వచ్చినా ఆ యాప్ ద్వారా రక్షించుకునే విధంగా చేపట్టారు. దీనికి సంబంధించి మొదటి విజయం కూడా నమోదు అయ్యింది. ఓ మహిళ ఇచ్చిన కంప్లైంట్ మేరకు పోలీసులు స్పందించి నిమిషాలలో ఆ ఆకతాయిని అరెస్ట్ చేయడం జరిగింది. విశాఖపట్నం నుండి విజయవాడ వెళ్తున్న ఒక మహిళ పట్ల పోకిరిలు అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె ఆ యాప్ ద్వారా ఫిర్యాదు చెయ్యగా వెంటనే పోలీసులు స్పందించి ఏలూరు దగ్గర అతడిని అరెస్ట్ చేసారు. వెంటనే స్పందించిన పోలీసులను జగన్ అభినందించారు.