తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో.. మంచు వారసుడు మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారనే సంగతి అందరికి తెల్సిందే. అయితే సోషల్ మీడియాలో తన అభిమానికి హీరో మనోజ్ క్షమాపణలు చెప్పారు. తన నుండి వారంలో సరికొత్త ఆప్డేట్ ఉంటుంది.
అప్పటిదాకా వేచి ఉండండి అని గత నెల జనవరి చివర్లో మనోజ్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఫిబ్రవరి రెండో వారం గడిచిన కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ హీరో మనోజ్ నుండి రాలేదు ఎందుకు అని హీరో మనోజ్ అభిమాని ప్రశ్నించాడు.
దీనికి సమాధానంగా హీరో మనోజ్ స్పందిస్తూ” తనని ప్రశ్నించిన అభిమానికి క్షమాపణలు చెప్పారు. అక్కడితో ఆగకుండా ఇంకాస్త లేట్ అవుతుంది తమ్ముడు .. అందుకు కూడా తనని క్షమించాలని సమాధానమిచ్చాడు.