40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత నియోజకవర్గం కుప్పం ప్రజలు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి కుప్పం ప్రజలు జై కొట్టారు. దీంతో ఈ విషయం సర్వత్రా హాట్‌టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ..జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియం బిల్లును అసెంబ్లీలో ఆమోదించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తల్లిదండ్రులు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు, వివిధ సామాజికసంస్థలు స్వాగతించాయి.
అయితే ప్రభుత్వం చేసే ప్రతి మంచిపనిని రాజకీయంగా అడ్డుకోవాలని చూసే చంద్రబాబు, ఆయన లోకేష్‌తో సహా, టీడీపీ నేతలు ఇంగ్లీష్ మీడియంతో అమ్మ భాషను చంపేస్తున్నారంటూ గగ్గోలుపెట్టారు. ఇక చంద్రబాబు అనుకుల మీడియా ఛానళ్లు, పత్రికలు అయితే ఆంగ్ల భాష వద్దు..తెలుగు భాష ముద్దు అంటూ…పుంఖాను పుంఖానులుగా పచ్చ కథనాలు వండివార్చాయి. అంతటి ఆగకుండా కొంత మంది టీడీపీ అనుకుల వ్యక్తులు కావాలనే ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకంగా హైకోర్టులో కేసు వేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలోనే చదవాలని వారిని నిర్బంధించలేమని స్పష్టం చేసింది. విద్యార్థులకు నచ్చిన మీడియంలో చదువుకునే వెసులుబాటు ఇవ్వాలని సూచించింది. కాని ప్రభుత్వ పాఠశాలల్లో ఇాంగ్లీష్‌మీడియం ప్రవేశపెడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా మరికొంత మంది తల్లిదండ్రులు హైకోర్టుకు వెళ్లారు.
కాగా హైకోర్ట్ తీర్పు నేపథ‌్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇంగ్లిష్ మీడియానికి మద్దతిస్తూ ప్రభుత్వం పాఠశాలల్లోని పేరెంట్స్ కమిటీలు తీర్మానాలు చేస్తున్నాయి. ఈ విషయంపై తాజాగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ…రాష్ట్రవ్యాప్తంగా ఇంగ్లీష్ మీడియంకు మద్దతిస్తూ.. 43 వేల పాఠశాలల నుంచి వచ్చిన పేరెంట్స్ కమిటీల తీర్మాన ప్రతులను ప్రభుత్వానికి అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం మండలంలో కూడా అన్ని ప్రభుత్వ పాఠశాలల నుంచి ఇంగ్లీష్ మీడియంకు మద్దతుగా తీర్మానాలు వచ్చాయని మంత్రి సురేష్ తెలిపారు. దీంతో ఈ విషయం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
ఒక పక్క టీడీపీ అధ్యక్షుడు, కుప్పం ఎమ్మెల్యే అయిన చంద్రబాబు ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా రచ్చ చేయిస్తే..ఆయన సొంత నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లల తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం విషయంలో సీఎం జగన్‌కు జై కొట్టడం హాట్ టాపిక్‌గా మారింది. తమ బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని బాగుపడడం చంద్రబాబుకు ఇష్టం లేదని..అందుకే అడ్డుకుంటున్నాడని…హైకోర్టుల్లో కేసులు వేయిస్తున్నాడని..కుప్పం ప్రజలు మండిపడుతున్నారు. అందుకే ఇంగ్లీష్ మీడియం విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా తీర్మానాలు చేసి విద్యాశాఖకు పంపారు. మొత్తంగా ఇంగ్లీష్ మీడియం విషయంలో కుప్పం ప్రజలు 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు దిమ్మతిరిగేషాక్ ఇస్తూ సీఎం జగన్‌కు జై కొట్టడం సంచలనంగా మారింది.