ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ముగిసింది. మంత్రిమండలిలో తీసుకున్న నిర్ణయాలివే..!
- పంచాయితీ రాజ్ చట్టంలో సవరణలకు ప్రభుత్వం ఆమోదించి.
*పంచాయితీ ఎన్నికల్లో పోటీచేసే వ్యక్తులు గ్రామాల్లో ఉండేలా, గ్రామ అభివృద్ధి, పాలనా వ్యవహారాల్లో రోజువారీ పాల్గొనేలా ఎన్నికల్లో ప్రలోభపెట్టే చర్యలను నివారించేందుకు సవరణలు చేయనున్నారు.
*పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో నియమావళికి విరుద్ధంగా అక్రమాలకు పాల్పడితే గతంలో ఉన్న 3–6 మాసాలు మాత్రమే శిక్షలు ఉండేవి కాని ఇప్పుడు పదవినుంచి తొలగించడమే కాకుండా, గరిష్టంగా 3 యేళ్ల జైలు శిక్ష, రూ.10వేలు జరిమానా.
*ఎన్నికల్లో నెగ్గిన తర్వాత కూడా ప్రలోభాగాలకు, నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారని ధారాలు లభిస్తే పదవులనుంచి తొలగింపు, చట్ట ప్రకారం చర్యలు.
*లెక్కింపు సమయం మినహా మొత్తం 13 నుంచి 15 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగించేలా సవరణలు
*పంచాయితీ ఎన్నికలల్లో ప్రచార గడువు 5 రోజులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రచారగడువు 7 రోజులుగా నిర్ణయిస్తూ కేబినెట్ ఆమోదం
*గిరిజనులకు అనుకూలంగా మరో కీలక నిర్ణయం తీసుకున్న మంత్రిమండలి
*నూటికి నూరుశాతం గిరిజన జనాభా ఉన్న తండాల్లో పంచాయితీ వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ పదవులు పూర్తిగా వారికే కేటాయించాలని నిర్ణయం
*పారిశుద్ధ్యం, పచ్చదనం పెంచే బాధ్యతలు కూడా సర్పంచులకే అప్పగిస్తూ నిర్ణయం
*ఎన్నికైన సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఆయా గ్రామాల్లోనే స్ధానికంగా నివసించాలని కేబినెట్ నిర్ణయం.
*ప్రకృతి వైపరీత్యాలు, నీటి ఎద్దడి సమయంలో అత్యవసర చర్యలు తీసుకునే అధికారం సర్పంచులకే
*పంచాయితీ ఎన్నికలకు సంబంధించిన ఈ నియమాలన్నీ కూడా మున్సిపాల్టీలలో పోటీ చేసే అభ్యర్ధులకూ వర్తింపజేస్తూ నిర్ణయం
2.మున్సిపల్ కార్పొరేషన్ చట్టలో సవరణలకు కేబినెట్ ఆమోదం. దీనిపై ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయం.
*కౌంటింగ్ మినహా గతంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ గతంలో 24 రోజులు కాగా దాన్ని 15 రోజులకు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం
3.ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లిమిటెడ్ (ఏపీఎస్‌ఎఫ్‌ఎస్) ఏర్పాటుకు ఆమోదం.
*నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌గా ఏర్పాటు
*మిగులు నిధులను సక్రమంగా వినియోగించుకునేందుకు ఏపీఎస్‌ఎఫ్‌ఎస్ ఏర్పాటు
*గుజరాత్‌లో 1992లో ఇలాంటి కార్పొరేషన్ ఏర్పాటు
*మంచి ఫలితాలు ఇస్తోందని కేబినెట్‌కు వివరించిన అధికారులు
4.ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
*వ్యవసాయ, ఉద్యానవన రంగాల్లో ఉత్తమ పద్దతులకు తోడ్పాటునివ్వనున్న అగ్రికల్చర్ కౌన్సిల్
*నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ఇరిగేషన్ టెక్నాలజీ, వ్యవసాయ ఉత్తత్తుల మార్కెటింగ్, ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్, నాణ్యమైన విధానాల కోసం రెగ్యులేటింగ్ మెకానిజంగా పనిచేయనున్న కౌన్సిల్
*అగ్రికల్చర్, హర్టికల్చర్ విద్యపై నియంత్రణ, పర్యవేక్షణ
*ఉత్తమ విద్యను అందించడం, మౌలిక సదుపాయాలు కల్పించడం దీని లక్ష్యం
*విద్యావ్యవస్ధను ఏ విధంగా మానిటరింగ్ చేస్తున్నారో, అదే విదంగా వ్యవసాయ విద్యనుకూడా మానిటర్ చేసేందుకు ఈ వ్యవస్ధ ఏర్పాటుకు నిర్ణయం
*ప్రభుత్వరంగ సంస్ధలు, అనుబంధ సంస్ధలకు, పబ్లిక్, ప్రైవేట్ విభాగాల్లో పనితీరు మెరుగుపరిచేందుకు తోడ్పాటు అందించనున్న కౌన్సిల్
*అగ్రికల్చర్, హర్టికల్చర్ విద్యాసంస్ధలను మానిటర్ చేయడంతో పాటు సరైన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టనున్న కౌన్సిల్
*నిబంధనలు, నియమాలు పాటించే కాలేజీలకు గుర్తింపునివ్వనున్న కౌన్సిల్
*నకిలీ సర్టిఫికెట్స్ నిరోధంపై ప్రత్యేక దృష్టి
*ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వనున్న కౌన్సిల్
*జాతీయ, రాష్ట్ర స్దాయిలో ఇప్పటివరకూ లేని విధంగా కౌన్సిల్ ఏర్పాటు
5.ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
*10,000 మెగావాట్ల సామర్ద్యం గల ప్రాజెక్ట్‌ల ద్వారా రాష్ట్రంలో పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా లక్ష్యం
*రైతులకు ఉచిత విద్యుత్, ఆక్వా రైతులకు సబ్సిడీపై విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం
*దీనివల్ల ఏటా బడ్జెట్ మీద రూ.10,000 కోట్ల భారం పడుతోంది
*ఈ నేపధ్యంలో నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను, ఆక్వారైతులకు ఇచ్చే సబ్సిడీ విద్యుత్‌ను నిరాటంకంగా కొనసాగించాలంటే ప్రత్యామ్నాయాన్ని అనుసరించాల్సిన అవసరం ఏర్పడింది
*దీనికోసం 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను నిరంతరాయంగా అందించేందుకు ఈ ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేసింది
*ఆంధ్రప్రదేశ్‌లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అనుకూల వాతావరణం ఉంది
*ఏడాదిలో ఎండ కాచే రోజులు ఎక్కువ
*కేంద్ర ప్రభుత్వంలోని సంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వశాఖ ప్రతి మెగావాట్‌కు కూడా రూ. 20 లక్షల ఆర్దిక సహాయం అందిస్తుంది.
*ఈ వెసులుబాటును వినియోగించుకోవాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయం
*ఏపీ జెన్‌కోకు అనుబందంగా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ఏర్పాటకు కేబినెట్ ఆమోదం
*దీనిలో ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సహా 18 పోస్టులు మంజూరుకు ఆమోదం
- భూసేకరణలో ఇప్పటివరకు పండ్లు, పూలతోటలకు ఇచ్చే నష్టపరిహారం పెంచుతూ నిర్ణయం తీసుకున్న కేబినెట్
*మామిడి పరిహారం రూ.7283లకు పెంచుతూ నిర్ణయం, గతంలో రూ.2600 మాత్రమే
*కొబ్బరి చెట్టుకు రూ.6090 పరిహారం పెంపు, గతంలో ఈ మొత్తం కేవలం రూ.2149
*నిమ్మపంటకు రూ.3210 పెంచుతూ నిర్ణయం, గతంలో ఈ పరిహారం కేవలం రూ.1444 మాత్రమే ఉండేది
*మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు పెరుగుతున్న ఖర్చులతో పాటు నష్టం వాటిల్లిన పరిస్ధితుల్లో పండ్లతోటలకు ఇచ్చే పరిహారాన్ని పెంచాలన్న నిర్ణయానికి ఆమోదముద్ర వేసిన కేబినెట్
7.వైయస్సార్ కడప జిల్లా వేంపల్లెలో కొత్త ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం