గత 50 రోజులకుపైగా రాజధాని గ్రామాల రైతులను రెచ్చగొట్టి పెద్ద ఎత్తున ఆందోళనలను నడిపించిన టీడీపీ అధినేత చంద్రబాబు మెల్లగా అమరావతి కాడిని పక్కన పెట్టేస్తున్నారు. అబ్బబ్బబ్బా…అమరావతి గురించి బాబుగారి డ్రామాలు నెవ్వర్ బిఫోర్…ఎవ్వర్ ఆఫ్టర్..భార్యను తీసుకువచ్చి రెండు బంగారు గాజులు దానం చేయించి..అమరావతి సెంటిమెంట్‌ను కొట్టి… మహిళల గాజులు, ఉంగరాలు, దిద్దులు, కాళ్లపట్టీలతో సహా..తన జోలెలో వేసుకున్నాడు..ఇక అంతటితో ఆగాడా ఈ వ్యాపారం ఏదో బాగుందనుకుని…స్వయంగా జోలెపట్టి ఊరూరా తిరిగి…రాజధాని కోసమంటూ డబ్బులు అడుక్కున్నాడు. పాపం బాబుగారు అమరావతి నుంచి రాజధాని తరలించకుండా అడ్డుకుంటాడంటూ నమ్మిన అమాయక జనం..ఆయన జోలెలో పోలోమంటూ డబ్బులు వేశారు…రాజధాని పుణ్యమాఅని బాబుగారి జోలెదండిగా నిండుకుంది..సంక్రాంతి పండుగ రోజు కోడలిని, భార్యను తీసుకువచ్చి ఒక్కపూట పస్తులుంచి మరీ రాజధాని డ్రామా పండించాడు.
బాబుగారి డ్రామాలతో ఒళ్లుమండిన జగన్ సర్కార్ వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో ప్రవేశపెడితే..అక్కడ యనమల గారి అతి తెలివితో స్పీకర్‌ను అడ్డంపెట్టుకుని సెలెక్ట్ కమిటీకి పంపించాడు..దీంతో అమాయక రాజధాని జనం బాబుగారిపై పూలవర్షం కురిపించారు.తాము జోలెలో వేసిన డబ్బులకు న్యాయం జరిగిందని..రాజధాని రైతులు ఆనందపడ్డారు..అదీ మూన్నాళ్ల ముచ్చటే అయిపోయింది. వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపడంతో ఆగ్రహించిన సీఎం జగన్ ఏకంగా శాసనమండలిని రద్దు చేసి..బిల్లును కేంద్రానికి పంపించాడు. దీంతో కంగుతిన్న చంద్రబాబు మెల్లగా అమరావతి సీరియల్ డ్రామాలను తగ్డించడం మొదలెట్టాడు. అమరావతి కోసం చూసుకుంటే..తన కొడుకు ఎమ్మెల్సీ పదవి కూడా పోతుందేమోనన్న భయంతో బాబుగారు సైలెంట్ అయిపోయాడు.
నిన్నటి దాకా అమరావతి నుంచి రాజధానిని తరలించలేరు అంటూ బీరాలు పలికిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మెల్లగా పక్కదారి పట్టిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం మూడు రాజధానులపై దూకుడుగా వ్యవహరిస్తోంది. కర్నూలుకు, విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తోంది. ఈ కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో అమరావతి రైతులు కేసులు వేసినా పెద్దగా ఒరిగేదేం లేదు..ప్రభుత్వ కార్యాలయాలను ఎక్కడ పెట్టాలనే విషయం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం..వీటిని హైకోర్టు తాత్కాలింగా ఆపగలుగుతాయి తప్ప…శాశ్వతంగా కార్యాలయాలను అమరావతిలోనే ఉంచాలని చెప్పలేదు.దీంతో చంద్రబాబుకు అసలు మ్యాటర్ అయిపోయింది..అమరావతి పాట పాడితే..రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో పార్టీ మట్టికొట్టుకుని పోవడం ఖాయమని అర్థమైంది. అందుకే అమరావతి డ్రామాను పక్కన పడేసి..మరో డ్రామాకు తెరతీశాడు.
తాజాగా 45 రోజుల పాటు బస్సు యాత్రలను షురూ చేయబోతున్నాడు. ఫిబ్రవరి 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో బాబుగారి బస్సు యాత్ర చేస్తారంట…ఇక పార్టీ నియోజకర్గ ఇన్‌చార్జిలు, ఉన్న 21 మంది ఎమ్మెల్యేలకు (వంశీ, మద్దాలి గిరి కాకుండా) జనాలను తరలించి..తనకు జేజేలు కొట్టించాలని ఆర్డరేశారు. కియా తరలింపుపై యాగీ చేసినా ఫలితం లేకపోయినా సరే….ఆ అంశాన్నే అడ్డుపెట్టుకుని వైసీపీ ప్రభుత్వంలో పెట్టుబడులు తరలిపోతున్నాయంటూ బురద జల్లడానికి ఈ బస్సు యాత్రలను చేపట్టాడు. ఒక్క అమరావతి పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించలేడు..ఇలా ప్రభుత్వ వైఫల్యాల పేరుతో ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసే పని పెట్టుకున్నాడు..అలా మెల్లగా అమరావతి కాడిని బాబుగారు పడేశారు…ఇప్పుడు మీకు అర్థమవుతుందా..అమరావతి ఉద్యమాన్ని బాబుగోరు ఎందుకు పక్కనపడేశారో..