ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు పాదయాత్రలో భాగంగా ప్రతీఇంటికి, గడపకు వెళ్లి వారి కష్టాలను తెలుసుకుకొని నేను విన్నాను, నేను ఉన్నాను అని మాట ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యాక అందరికి న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. దాంతో నమ్మిన ప్రజలు జగన్ ను అఖండ మెజారిటీతో గెలిపించారు. దాంతో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మొదటిరోజు నుండి ఇప్పటివరకు ప్రతీరోజు ప్రజలకోసమే కష్టపడుతున్నారు. ఈ 9నెలల్లో ఆయన ప్రజలకు ఎన్నో పథకాలు తెచ్చిపెట్టారు. ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు విషయంలో వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఇలా స్పందించారు. “ప్రతిపక్ష నేతగా 9 నెలల్లో చేసిందేమిటంటే… ఇసుక మాఫియాను రక్షించేందుకు ఇస్కో… ఉస్కో అంటూ శివాలూగాడు. ‘ఇన్ సైడర్’ భూముల కోసం ప్రభుత్వాన్నికూలుస్తా… తేలుస్తా అని గాల్లో కత్తులు తిప్పాడు. అవినీతి అధికారులకు కాపలాదారయ్యాడు. పొర్లు దండాలతో బొంగరంలా తిరగడమే మిగిలింది”. అని అన్నారు
