అరుణాచల్ ప్రదేశ్ మాజీసీఎం కలిఖో పుల్ కొడుకు షుబన్సో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. కెనడా విశ్వవిద్యాలయంలో చదువుతున్న షుబన్సో చనిపోయినట్లు కుటుంబ వర్గాల సమాచారం. 2016లో ఆత్మహత్యకు పాల్పడిన మాజీ సీఎం ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కలిఖో మొదటిభార్య డాంగ్విమ్సాయ్ కుమారుడైన షుబాన్సో సస్సెక్‌్ాలోని బ్రైటన్‌లోని తన అపార్ట్మెంట్లో శవమై కనిపించడంతో కుటుంబ వర్గాలు దిగ్బ్రాంతికి గురవుతున్నాయి. అతని మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు యూకేలోని భారత హైకమిషన్‌తో సంప్రదిస్తున్నామని తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డావంటూ 2015 ఏప్రిల్‌లో షోకాజ్ నోటీసివ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఆరేళ్లపాటు పార్టీ బహిష్కరణ చేయడంతో 19 ఫిబ్రవరి 2016న 30మంది రెబెల్ ఎమ్మెల్యేలు, బీజేపీ మద్దతుతో కలిసి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అయితే, ఈనియామకానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఆవేదనకు లోనైన ఫుల్ ఆగస్టు 9, 2016 న నీతి విహార్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అవినీతిపై ”మేరే విచార్” (నా ఆలోచనలు) అనే పేరుతో 60 పేజీల సూసైడ్ నోట్ కూడా రాశారు.
