జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. గతంలో మళ్లీ సిన్మాలు చేయనని..పూర్తిగా రాజకీయాలకే అంకితం అని చెప్పిన పవన్ కల్యాణ్..తన మాట తప్పి..తిరిగి సిన్మాలు చేసుకోవడంపై జనసేన శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన కీలక నేత సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పవన్ సిన్మాల్లో తిరిగి నటించడాన్ని తప్పు పడుతూ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా విశాఖ జిల్లాకే చెందిన మరో కీలక నేత, గాజువాక సీనియర్ నేత కరణం కనకారావు పార్టీకి రాజీనామా చేశారు. గాజువాక వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సమక్షలో కరణం కనకారావు వైసీపీలో చేరారు. కనకారావుకు ఎమ్మెల్యే నాగిరెడ్డి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కనకారావుతో పాటు 200 మంది జనసైనికులు కూడా వైసీపీలో చేరడం విశేషం. కాగా గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్వయంగా గాజువాక నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే గాజువాక నుంచి సీనియర్ నాయకుడు కనకారావుతో సహా 200 మంది కార్యకర్తలు వైసీపీలో చేరడంతో గాజువాకలో గాజుగ్లాసు పూర్తిగా పగిలిపోయినట్లైంది. మొత్తంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్న పవన్ కల్యాణ్ తీరుతో విసిగిపోయిన జనసేన నాయకులు, కార్యకర్తలు వరుసగా పార్టీకి గుడ్‌బై చెబుతూ వైసీపీలో చేరడం ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాశంగా మారింది.
