తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరంలో హైదరాబాద్ లో మరో నూట పదిహేడు బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా ఇప్పటికే జీహెచ్ఎంసీ అందుకు సంబంధించిన స్థలాలు,భవనాల ఎంపికను పూర్తి చేసింది. బస్తీ దవాఖానలకు అవసరమైన సిబ్బందిని ,మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాల్సి ఉంది.
నగరంలో వార్డుకు రెండు చొప్పున మొత్తం నూట యాబై వార్డులకు రెండు చొప్పున మొత్తం మూడు వందల దవఖానలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది వైద్యారోగ్య శాఖ. వీటిని వచ్చే వర్షపు కాలం లోపు సిద్ధం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.