తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ నెల పదిహేడో తారీఖున తన అరవై ఆరో పుట్టిన రోజు వేడుక జరుపుకోనున్న సంగతి విదితమే.
ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మొత్తం 1,01,116మొక్కలు నాటనున్నట్లు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.
ఈ క్ర్తమంలో పాఠశాల ,కళాశాల విద్యార్థులు మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. కేవలం మొక్కలను నాటి వదిలేయడం కాకుండా ఉపాధ్యాయుల నేతృత్వంలో విద్యార్థులు వాటిని రక్షించేలా చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.