ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కర్నూలు జిల్లా పర్యటన ఖరారు అయ్యింది. ఇప్పటికే సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వీరపాండియన్ అధికారులను ఆదేశించారు.సీఎంగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారిగా జిల్లాకు వస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ఈ నెల 17న కల్లూరు మండలం పెద్దపాడు సంజీవయ్య ఉన్నత పాఠశాల ఆవరణంలో వైఎస్సార్ కంటి వెలుగు ఫేజ్-3 (60 ఏళ్లు పైబడినవారికి కంటి పరీక్షలు) ప్రారంభిస్తారని తెలిపారు. నవరత్నాలలో భాగంగా నాడు-నేడు పథకం, ఏఎన్‌ఎం సబ్ సెంటర్ నిర్మాణానికి శిలాఫలకం ఆవిష్కరణ ఉంటాయని తెలిపారు. అలాగే ఈ నెల 27 న కర్నూల్ రాగమయూరి ఫంక్షన్ హాల్ లో జరగబోయే తన కుమారుడి వివాహానికి రావాలని జగన్ ను సీఎం క్యాంప్ ఆఫీస్ నందు పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ ఆహ్వాన పత్రిక అందజేశారు. దీంతో చెరుకులపాడు నారాయణ రెడ్డి కొడుకు పెళ్లికి సీఎం జగన్ హాజరువుతున్నారు.