ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావు సస్పెన్షన్ వ్యవహారంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా ఏబీ సస్పెన్షన్‌పై స్పందిస్తూ జగన్ ప్రభుత్వం ఫాక్షనిస్ట్‌గా వ్యవహరిస్తుందని, అధికారులపై కక్షసాధిస్తుందని ఆరోపణలు చేయడంతో అధికార పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న సమయంలో దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాలు కొనడమే కాకుండా, బినామీల పేరుతో భూకబ్జాలకు పాల్పడిన ఒక అవినీతి అధికారి సస్పెండ్ అయితే..చంద్రబాబు ఎందుకు అంతగా ఉలిక్కిపడుతున్నారని…ఎందుకు వెనకేసుకువస్తున్నారని వైసీపీ ప్రశ్నిస్తోంది.
అయితే ఏబీవీ సస్పెన్షన్ వ్యవహారంలో చంద్రబాబుకు స్వయంగా టీడీపీ ఎంపీ కేశినేని షాక్ ఇచ్చారు. ఏబీవీ సస్పెన్షన్‌పై నాని ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ…మీరు ముఖ్యమంత్రి అవడానికి మీ పార్టీ అధికారంలోకి రావడానికి.. తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ప్రధాన భూమిక పోషించిన వ్యక్తిని సన్మానిస్తారనుకుంటే సస్పెండ్ చేశారేంటి జగన్మోహన్ రెడ్డి గారూ అంటూ సెటిైరికల్ ట్వీట్ చేశారు. దీంతో ఏబీవీతో చంద్రబాబు పలు అక్రమాలు చేయించాడని స్వయంగా టీడీపీ నేతలే బయటపెట్టినట్లైంది. కేశినేని నాని ట్వీట్‌తో అవినీతి అధికారులను చంద్రబాబు వెనకేసుకువస్తున్నారంటూ వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. నాని ట్వీట్‌తో చంద్రబాబుకు, టీడీపీ నేతలకు ఇబ్బందికర పరిణామం ఎదురైంది.
కాగా కేశినేని నాని తీరును సొంత టీడీపీ నేతలు తప్పుపట్టారు.అధికారంలో ఉన్నప్పుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, టీడీపీలో చేర్పించడంలో చంద్రబాబుకు ఏబీవీ సహకరించారు. నంద్యాల ఎన్నికలలో టీడీపీ గెలుపుకు కూడా ఏబీవీ చక్రం తిప్పారు.. ఎన్నికలప్పుడు కూడా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టడంలో ఏబీవీ కీలక పాత్ర పోషించారు..ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే.. అయినా మన ఇంటి గుట్టును మనమే బయటపెట్టుకుంటే ఎలా అంటూ…..టీడీపీ నేతలు కేశినేని నానిపై విరుచుకుపడ్డారంట…అంతే కాదు నాని తీరుపై చంద్రబాబుకు కంప్లైంట్ చేశారని సమాచారం. దీంతో కేశినేని నాని మరో ట్వీట్ చేస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. ‘అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను భుజాల పైన ఎక్కించుకుని మోయటమే పార్టీ విధానం అయితే నేను ఖచ్చితంగా ఆ విధానానికి వ్యతిరేకమే’ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు.
ఇంతకీ ఆ వీడియో ఏంటంటే… ఏబీవీ సస్పెన్షన్‌పై ప్రభుత్వాన్ని తప్పు పడుతూ చంద్రజ్యోతి ఛానల్ డిస్కషన్ పెట్టింది…ఆ చర్చలో పాల్గొన్న టీడీపీ నేత పట్టాభి మాట్లాడుతూ…ఏబీవీ సస్పెన్షన్‌పై కేశినేని నాని ట్వీట్‌ను ప్రస్తావించారు…గత ఎన్నికల్లో మా పార్టీ ఓటమికి ఏబీవీ కారణమని ఏ నాడు భావించలేదంటూ….అది కేవలం కేశినేని నాని వ్యక్తిగత అభిప్రాయం..దానికి తెలుగు దేశం పార్టీకి సంబంధం లేదని… పట్టాభి తేల్చిచెప్పారు. దీంతో కేశినేని ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేస్తూ…అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను భుజాల పైన ఎక్కించుకుని మోయటమే పార్టీ విధానం అయితే నేను ఖచ్చితంగా ఆ విధానానికి వ్యతిరేకమే అంటూ మరో సంచలన ట్వీట్ చేశారు…ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సో… అవినీతి అధికారులను చంద్రబాబు భుజాన మోస్తున్నాడని కేశినేని నాని ఈ వీడియో ద్వారా చెప్పకనే చెప్పాడు. మొత్తంగా ఏబీవీ సస్పెన్షన్‌పై రాజకీయం చేద్దామనుకుంటున్న చంద్రబాబుకు కేశినేని నాని తీరు తలనొప్పిగా మారింది.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను భుజాలపైన ఎక్కించుకుని మోయటమే పార్టీ విధానం అయితే నేను ఖచ్చితంగా ఆ విధానానికి వ్యతిరేకమే pic.twitter.com/hMHgyzYuho
— Kesineni Nani (@kesineni_nani) February 11, 2020